- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బరిలో ఉంటారా? లేదా?.. షర్మిల మౌనం వీడాలి
దిశ, తెలంగాణ బ్యూరో: రాజన్న సంక్షేమ పాలనే లక్ష్యంగా తెలంగాణలో పార్టీ పెట్టిన షర్మిల.. ఎన్నికలకు మరో 28 రోజులే మిగిలున్నా తన కార్యాచరణను ఇప్పటి వరకు ప్రకటించలేదు. అసలు బరిలో ఉంటారా? లేదా? అనే క్లారిటీ కూడా నేతలకు ఇవ్వడంలేదు. ఇప్పటికే అన్ని పార్టీలు తమ అభ్యర్థులను ప్రకటించాయి. శుక్రవారం నుంచి నామినేషన్లు కూడా ప్రారంభం కానున్నాయి. అయినా ఇప్పటి వరకు ఆమె నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో పలువురు నేతలు లోటస్ పాండ్‌లో ధర్నాకు దిగారు.
అసలు పోటీ చేయాలా? వద్దా? అనే అంశంపై అయినా షర్మిల మౌనం వీడాలని పలువురు నేతలు డిమాండ్ చేశారు. తాము ఇన్నిరోజులుగా కష్టపడ్డామని, తమకు న్యాయం కావాలని పట్టుపట్టారు. లోటస్ పాండ్ ఆవరణలో బైఠాయించి నిరసనకు దిగారు. పోటీపై షర్మిల మౌనం వీడాలని వారు డిమాండ్ చేశారు. ఈ నిరసనలో ఖైరతాబాద్‌కు చెందిన పార్టీ నేత రమణతో పాటు పలువురు కార్యకర్తలు ఉన్నారు.