- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
జర్నలిస్టులకు కమ్యూనిస్టు పార్టీ శుభవార్త
దిశ, డైనమిక్ బ్యూరో: జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు ఇచ్చే విషంయలో తమ మద్దతు ఉంటుందని సీపీఐ, సీపీఎం పార్టీలు హామీ ఇచ్చాయి. ఈ మేరకు శుక్రవారం సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు, ఆ పార్టీ జాతీయ కార్యదర్శి నారాయణ, జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకటరెడ్డిలను డెక్కన్ జర్నలిస్ట్ హౌసింగ్ సొసైటీ (డీజేహెచ్ఎస్) అధ్యక్షులు బొల్లోజు రవి, ఉపాధ్యక్షులు మరిపాల శ్రీనివాస్, ట్రెజరర్ చిలుకూరు అయ్యప్ప, డైరెక్టర్లు దండ రామకృష్ణ, డేగ కుమార్ తదితరులు ఆయా రాష్ట్ర పార్టీ ఆఫీసుల్లో వారిని వేరువేరుగా కలిశారు. జర్నలిస్టులకు ఇంటి స్థలాలు ఇచ్చే విషయంలో తాము సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నామని తమ్మినేని, కూనంనేని తెలిపారు.
ఎన్నికల మేనిఫెస్టోలో జర్నలిస్టుల ఇంటి స్థలాల అంశాన్ని తమ ఎన్నికల మేనిఫెస్టోల్లో పొందుపరుస్తామని హామీ ఇచ్చారు. తమ్మినేని అక్కడికక్కడే పార్టీ ఎన్నికల మేనిఫెస్టో కమిటీలో చేర్చాలని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడికి సూచించారు. ఈ సందర్భంగా డీజేహెచ్ఎస్ అధ్యక్షులు బొల్లోజు రవి మాట్లాడుతూ, జర్నలిస్టులకు ఇంటి స్థలం ఇవ్వడంతో పాటు వారు ఇల్లు కట్టుకునేందుకు ప్రభుత్వం రూ.10 లక్షల ఆర్థిక సాయం చేయాలని, ఆ మేరకు ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపరచాలని కోరినట్లు తెలిపారు. కాగా, ఇప్పటికే తాము బీఆర్ఎస్, కాంగ్రెస్, బిజెపి పార్టీ నాయకులకూ వినతి పత్రాలు ఇచ్చామని తెలిపారు. మంత్రులు కేటీఆర్, హరీష్ రావు, ఎమ్మెల్సీ కవిత, టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి, బీజేపీ అధ్యక్షులు, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి లను కలిసినట్లు తెలిపారు.