ఓట్ల కోసం తప్పుడు హామీలు ఇవ్వను: సీఎం కేసీఆర్

by GSrikanth |
ఓట్ల కోసం తప్పుడు హామీలు ఇవ్వను: సీఎం కేసీఆర్
X

దిశ, డైనమిక్ బ్యూరో: రాబోయే ఎన్నికల్లో ఎవరో చెప్పారని ఆగం కావొద్దని ఎవరు గెలిస్తే రాష్ట్రం ముందుకు వెళ్తుందో ఆలోచన చూసి నిర్ణయం తీసుకోవాలని ప్రజలకు సీఎం కేసీఆర్ కోరారు. గురువారం అచ్చంపేటలో నిర్వహించిన ప్రజాఆశీర్వాద బహిరంగ సభలో మాట్లాడిన కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణను అన్ని విధాలుగా అభివృద్ధి చేశామని ఇప్పుడు వచ్చి కొందరు కొడంగల్‌కు రా, గాంధీ బొమ్మ దగ్గరకు రా.. అంటున్నారు. రాజకీయమంటే ఇలాంటి సవాళ్లా? కేసీఆర్ దమ్మేందో ఇండియా మొత్తం చూసింది. 24 గంటల కరెంట్ ఇస్తే కాంగ్రెస్‌ను వీడి బీఆర్ఎస్ కండువా కప్పుకుంటానని జానారెడ్డి సవాల్ విసిరారు. 24 గంటల కరెంటు ఇచ్చి చూపించాక ఏమయ్యారో తెలియదు. రైతు బంధు అనే పథానికి ఆధ్యుడు కేసీఆర్.

రైతు బంధును దశలవారీగా రూ.16 వేలకు పెంచుతామన్నారు. ఓట్ల కోసం తప్పుడు హామీలు ఇవ్వబోమన్నారు. అచ్చంపేట నియోజకవర్గంలో లక్ష ఎకరాలకు నీరు ఇస్తామన్నారు. పాలమూరు-ఎత్తిపోతల పథకంపై కాంగ్రెస్ నేతలు 109 కేసులు వేశారని ప్రాజెక్టులు పూర్తయితే కేసీఆర్ కు పేరు వస్తుందని కేసులు వేసి అడ్డుకుంటున్నారన్నారు. ధరణి పోర్టల్ తీసేస్తామని రాహుల్ గాందీ, రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క అంటున్నారు. ధరణి పోర్టల్ తెచ్చింది నా కోసమా? మా ఇంటికోసమా? అని ప్రశ్నించారు. రైతుబంధు డబ్బులు తినాలనే కాంగ్రెస్ ధరణి పోర్టల్ ను తీసేయాలనుకుంటోందన్నారు. తెలంగాణ ఇస్తామని 2004లో ప్రకటించిన కాంగ్రెస్ పార్టీ ఏడ్పించి ఏడ్పించి చివరకు గత్యంతరం లేక 2014లో ఇచ్చారని అన్నారు. ప్రజలు ఆలోచన చేసి ఓట్లు వేయాలని కోరారు.

Advertisement

Next Story

Most Viewed