ఓటు హక్కు వినియోగించుకున్న సీఎం కేసీఆర్ దంపతులు

by GSrikanth |
ఓటు హక్కు వినియోగించుకున్న సీఎం కేసీఆర్ దంపతులు
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు అందరూ ఆసక్తి చూపుకున్నారు. ఉదయం మొదటి రెండు గంటల్లో మందకోడిగా సాగిన పోలింగ్.. తర్వాతి రెండు గంటల్లో 11 గంటల వరకు భారీగా పెరిగింది. మొత్తంగా నాలుగు గంటల్లో 20 శాతానికి పైగా నమోదు అయింది. ఓటు వేసేందుకు సినీతారలు సైతం ఆసక్తి చూపించారు. తాజాగా.. ముఖ్యమంత్రి కేసీఆర్ తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. భార్య శోభతో కలిసి సిద్ధిపేట జిల్లాలోని చింతమడకలో ఓటు వేశారు. కేసీఆర్ రాకతో అక్కడ సందడి వాతావరణం చోటుచేసుకుంది.

Advertisement

Next Story