- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఓటు విశిష్టత గురించి గొప్పగా చెప్పిన సీఎం కేసీఆర్
దిశ, వెబ్‌డెస్క్: భద్రాద్రి కొత్తగూడెంలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్ పాల్గొన్నారు. ఓటు విశిష్టత గురించి గొప్పగా చెప్పారు. ఈ ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. ఎన్నికలు రాగానే ఎంత హడావుడి ఉంటుందో అందరికీ తెలుసని గుర్తుచేశారు. బూతులు, అబద్ధాలు, సిగ్గులేకుండా మాట్లాడుతారని అసహనం వ్యక్తం చేశారు. మన దేశ రాజకీయాలు పరిణితి చెందాలని అభిప్రాయపడ్డారు. ఓటు అనేది మన చేతిలో ఉన్న వజ్రాయుధం అని తెలిపారు.
తేడా వస్తే ఐదేళ్ల భవిష్యత్ తలకిందులు అవుతుందని అన్నారు. ప్రజలు ఆలోచించి ఓటేయాలని సూచించారు. అభ్యర్థి కంటే పార్టీ చరిత్ర చూసి ఓటేయాలని పిలుపునిచ్చారు. ప్రజలు కోరుకున్న వాళ్లు గెలిచినప్పుడే అది ప్రజల గెలుపు అయితది. కాబట్టి బాగా ఆలోచించి ఓటేయాలి. మూడు పార్టీల నుంచి ముగ్గురు అభ్యర్థులు పోటీలో ఉంటారు. ఆ ముగ్గురిలో ఎవరు మంచి వ్యక్తో చూడాలి. పార్టీల వైఖరి, ఆ పార్టీలు అధికారంలో ఉన్నప్పుడు చేసిన పనులను బేరీజు వేసుకోవాలి. ప్రతి ఒక్కరూ అలా ఆలోచించి ఓటేస్తేనే రాష్ట్రానికి మంచి జరుగుతది అని సీఎం సూచించారు.