సీఎం కేసీఆర్ రెండో విడత ప్రచారం షెడ్యూల్ విడుదల

by GSrikanth |
సీఎం కేసీఆర్ రెండో విడత ప్రచారం షెడ్యూల్ విడుదల
X

దిశ, వెబ్‌డెస్క్: ముఖ్యమంత్రి కేసీఆర్ రెండో విడత ప్రచారం షెడ్యూల్ ఖరారైంది. ఈనెల 13 నుంచి 28 వరకు విస్తృతంగా గులాబీ బాస్ ప్రచార సభలు నిర్వహించనున్నారు. 25వ తేదీన గ్రేటర్ హైదరాబాద్ మొత్తానికి కలిసి ఒకేచోట భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. 13న ఉమ్మడి ఖమ్మంలోని దమ్మపేట, బూర్గంపాడు, నర్సంపేట్‌లో, 14న పాలకుర్తి, హాలియా, ఇబ్రహీంపట్నం, 15న బోధన్, నిజామాబాద్ అర్బన్, ఎల్లారెడ్డి, మెదక్, 16న ఆదిలాబాద్, బోథ్, నర్సాపూర్, నిజామాబాద్ రూరల్‌, 17న కరీంనగర్, చొప్పదండి, హుజూరాబాద్, పరకాల, 18న చేర్యాల, 19న అలంపూర్, కొల్లాపూర్, నాగర్ కర్నూల్, కల్వకుర్తి, 20న మానకొండూర్, స్టేషన్ ఘన్‌పూర్, నకిరేకల్, నల్లగొండ, 21న మధిర, వైరా, డోర్నకల్, సూర్యాపేట, 22న తాండూరు, కొండంగల్, మహబూబ్‌నగర్, పరిగి, 23న మహేశ్వరం, వికారాబాద్, జహీరాబాద్, పటాన్ చెరు, 24న మంచిర్యాల, రామగుండం, ములుగు, భూపాలపల్లి, 25న గ్రేటర్ హైదరాబాద్‌లో భారీ సభ నిర్వహించనున్నారు.

Advertisement

Next Story