ఎన్టీఆర్‌ను గుర్తుచేసిన కేసీఆర్.. కొల్లాపూర్ సభలో కీలక వ్యాఖ్యలు

by GSrikanth |
ఎన్టీఆర్‌ను గుర్తుచేసిన కేసీఆర్.. కొల్లాపూర్ సభలో కీలక వ్యాఖ్యలు
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఈ ఎన్నికలు తెలంగాణ బతుకు దెరువు కోసం జరిగే పోరాటమని, మామూలుగా వేసే ఓటు కాదని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పిలుపునిచ్చారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇవాళ ఆయన కొల్లాపూర్‌ ప్రజా ఆశీర్వాద సభలో ప్రసంగించారు. ఇందిరమ్మ రాజ్యంలో ఆకలిచావులు తప్ప ఇంకేమీ ఉందని విమర్శించారు. పాలమూరులో ఒకప్పుడు గంజి కేంద్రాలు నడిపారని, ఎన్టీఆర్ అధికారలోకి వచ్చి రూ.2కే కిలో బియ్యం ఇచ్చారని గుర్తు చేశారు.

కాంగ్రెస్ పాలన బాగుంటే తెలుగుదేశం పార్టీ ఎందుకు పుట్టిందని అడిగారు. పక్కనే కృష్ణానది ఉన్నప్పటికీ పాలమూరు ప్రజలకు సాగునీరు అందలేదని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ నాయకులకు ఓట్లు అడగడానికి సిగ్గు లేదని మండిపడ్డారు. ఇటీవల కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కొల్లాపూర్‌లో సభ పెట్టారని, ఇక్కడికి గడ్డి కోయడానికి వచ్చాడా? అని ఎద్దేవా చేశారు. 50 ఏళ్లు పాలించిన కాంగ్రెస్ ఏం చేసిందో ఆలోచించాలని, అభ్యర్థులతో పాటు వారి పార్టీల చరిత్రను చూడాలని పిలుపునిచ్చారు.

Advertisement

Next Story

Most Viewed