- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆలోచింపజేస్తున్న BSP మేనిఫెస్టో.. ప్రతీ స్కీమ్‌లో RS ప్రవీణ్ కుమార్ మార్క్
దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో రాజకీయ హడావుడి జోరందుకుంది. రాష్ట్రంలోని రాజకీయ పార్టీలన్నీ ఎన్నికలకు సిద్ధమవుతున్నాయి. ఇప్పటికే కసరత్తు కూడా ప్రారంభించారు. ఈ నేపథ్యంలోనే.. బీఆర్ఎస్, కాంగ్రెస్, బీఎస్పీ పార్టీలు తొలి జాబితాను విడుదల చేసి, ప్రచారం కూడా మొదలు పెట్టాయి. బీజేపీ పార్టీ తొలి జాబితాకు తుది మెరుగులు దిద్దుతోంది. ఈ నేపథ్యంలోనే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ నేతృత్వంలో బీఎస్పీ.. ఈసారి ఎన్నికల్లో పోటీ చేసి సత్తా చాటేందుకు సిద్ధమైంది. ఇప్పటికే 20 మందితో తొలి జాబితాను పార్టీ ప్రకటించింది. తాజాగా.. ఇవాళ(మంగళవారం) మేనిఫెస్టోను విడుదల చేశారు. బీఎస్‌పీ మేనిఫెస్టోలో విద్య, ఉద్యోగం, ఉపాధి అంశాలపై ప్రధానంగా దృష్టి సారించారు. కాగా, తెలంగాణలో ఐపీఎస్‌గా సేవలందించిన ఆర్ఎస్పీ ప్రస్తుతం బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడి బాధ్యతలు నిర్వర్తిస్తున్న విషయం తెలిసిందే. కాగా.. ఆర్ఎస్పీ ఈ ఎన్నికల్లో సిర్పూర్ నియోజకవర్గం నుంచి బరిలో దిగనున్నారు.
కాన్షీ యువ సర్కార్
= యువతకు ఐదేళ్లలో పది లక్షల ఉద్యోగాలు.
= అందులో మహిళలకు 5 లక్షల కొలువులు.
= షాడో మంత్రులుగా విద్యార్థి నాయకులు
బహుజన రైతుబీమా
= ప్రతీ పంటకు కనీస మద్దతు ధరతో కొనుగోలు
= రైతులకు విత్తు నుంచి విక్రయం వరకు ఖచ్చితమైన ప్రభుత్వ రాయితీ
= ధరణి పోర్టర్ రద్దు
దొడ్డి కొమురయ్య భూమి హక్కు
= భూమి లేని ప్రతీ పేద కుటుంబానికి ఒక ఎకరం భూమి
= ఆ ఎకరం భూమి మహిళల పేరిట పట్ట
చాకలి ఐలమ్మ మహిళా జ్యోతి
= మహిళా కార్మికులు, రైతులకు ఉచిత వాషింగ్ మిషన్లు.
= మహిళలకు స్మార్ట్‌ఫోన్ మరియు డ్రైవింగ్ శిక్షణ
= అంగన్వాడీ, ఆశా వర్కర్ల ఉద్యోగాల క్రమబద్దీకరణ
భీమ్ రక్షా కేంద్రాలు
= వృద్ధులకు హాస్టల్, ఆహారం మరియు ఉచిత వైద్యం
= రక్షా కేంద్రాల్లో వికలాంగులకు మరియు ఒంటరి మహిళలకు తోడ్పాటు
పూలే విద్యా దీవెన
= మండలానికి ఒక ఇంటర్నేషనల్ స్కూలు. ప్రతీ మండలం నుంచి ఏటా వంద మంది విద్యార్థులకు ఉచిత విదేశీ విద్య
= డేటా ఏఐ మరియు కోడింగ్‌లో శిక్షణ
బ్లూ జాబ్ కార్డ్
= పల్లె, పట్టణాల్లో 150 రోజుల ఉపాధి హామీ
= రోజూ కూలీ రూ.350 పెంపు
= కూలీలకు ఉచిత రవాణా, ఆరోగ్యం మరియు జీవిత బీమా
నూరేళ్ల ఆరోగ్య ధీమా
= ప్రతీ కుటుంబానికి రూ.15 లక్షల ఆరోగ్య భీమా
= ఏటా రూ.25 వేల కోట్లతో పౌష్టికాహార ఆరోగ్య బడ్జెట్
వలస కార్మికుల సంక్షేమ నిధి
= రూ.5 వేల కోట్లతో గల్ఫ్ కార్మికులకు సంక్షేమ బోర్డు
= వలస కార్మికులకు వసతి
= గిగ్ కార్మికులు, లారీ మరియు టాక్సీ డ్రైవర్లకు 600 సబ్సిడీ క్యాంటీన్లు
షేక్ బందగి గృహ భరోసా
= ఇళ్లు లేని వారికి 550 ఇంటి స్థలం కేటాయింపు
= ఇళ్లు కట్టుకునే వారికి రూ.6 లక్షల సాయం
= ఇంటి పునర్మిణానికి రూ.1.50 లక్షల సాయం