పెళ్లి కార్డు కాదు.. ఓటర్లకు బీఆర్ఎస్ అందిస్తున్న ఆహ్వాన పత్రిక

by GSrikanth |
పెళ్లి కార్డు కాదు.. ఓటర్లకు బీఆర్ఎస్ అందిస్తున్న ఆహ్వాన పత్రిక
X

దిశ, తెలంగాణ బ్యూరో: అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కు మరో నాలుగు రోజులు గడువు మాత్రమే ఉండటంతో బీఆర్ఎస్ అభ్యర్థులు వినూత్న ప్రచారం చేపడుతున్నారు. ప్రజలను ఆకట్టుకునేందుకు పెండ్లి కార్డుల రూపంలో డిజైన్ చేశారు. ‘ఓటుహక్కు వినియోగ ఆహ్వాన శుభపత్రిక’ అంటూ ముంద్రించారు. అందులో ఈ నెల 30న పోలింగ్ తేదీ అని, ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఓటు హక్కు వినియోగించుకోవాలని అభ్యర్థిస్తున్నారు. కార్యస్థలం పోలింగ్ కేంద్రమంటూ కార్డులో పేర్కొన్నారు.

బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ తనను ఫలానా నియోజకవర్గం అభ్యర్థిగా ఆశీర్వదించారని, ఓటువేసి గెలిపించాలని ఓటర్లకు విజ్ఞప్తులు చేస్తున్నారు. ఆహ్వాన పత్రికలను సోషల్ మీడియాలో విస్తృత ప్రచారం చేస్తున్నారు. బూత్ స్థాయి నుంచి బీఆర్ఎస్ పార్టీ ఏర్పాటు చేసుకున్నగ్రూపుల్లో పార్టీ కార్యక్రమాలతో పాటు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన శుభపత్రిక పేరిట పోస్టు చేస్తున్నారు. ఓటర్లను మచ్చిక చేసుకోవడానికి వినూత్నంగా చేస్తున్న ప్రచారం ఆకట్టుకుంటుంది. గతానికి భిన్నంగా ఈసారి ఎన్నికల్లో అందివచ్చిన అవకాశాన్ని పార్టీ నేతలు సద్వినియోగం చేసుకుంటున్నారు.

Advertisement

Next Story

Most Viewed