- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
‘పనిమంతుడు పందిరేస్తే.. కుక్కతోక తాకి కూలిపోయిందట’
దిశ, డైనమిక్ బ్యూరో: లక్ష కోట్లతో నిర్మించిన కాళేశ్వరం నేడు ఇటుక మేడలా కుంగిపోతోందని బీజేపీ ఎంపీ డాక్టర్ లక్ష్మణ్ బీఆర్ఎస్ సర్కార్‌పై మండిపడ్డారు. లక్ష కోట్ల తెలంగాణ సంపద ఆవిరైపోతోంది.. దీనిపై ప్రజలకు కేసీఆర్ సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. ఇవాళ ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. పనిమంతుడు పందిరి వేస్తే.. కుక్కతోక తాకి కూలిపోయినట్లు నేడు కేసీఆర్ తీరు ఉందని విమర్శించారు. తానే పెద్ద పనిమంతుడని, తన కంటే గొప్ప ఇంజినీర్ లేడన్నట్లు కేసీఆర్ బిల్డప్ ఇస్తాడని విమర్శించారు. మేడిగడ్డ పిల్లర్ కుంగుబాటుపై డ్యామ్ సేఫ్టీ అథారిటీ కమిటీ కేంద్రానికి నివేదిక ఇచ్చిందని తెలిపారు.
ప్లానింగ్, డిజైన్, నాణ్యత నియంత్రణ, నిర్వహణ లోపాల వల్లే కుంగుబాటు అయిందని తెలిపారు. పునాది కింద ఇసుక కొట్టుకుపోయి పిల్లర్లు బలహీనపడ్డాయని, ఫౌండేషన్ మెటీరియల్ పటిష్టత తక్కువగా ఉండటం మరో కారణమని తెలిపారు. డ్యామ్ నిర్వాహకుల నిర్లక్ష్యం వల్ల బ్యారేజీ బలహీన పడుతోందని చాలా స్పష్టంగా కమిటీ నివేదిక ఇచ్చిందని చెప్పారు. మొత్తం బ్యారేజీని పునాదుల నుంచి తొలగించి తిరిగి పూర్తిగా నిర్మించాలని నివేదిక ఇచ్చినట్లు పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టు పేరు మీద తెలంగాణ సంపదను దోపిడీ చేశారని, నేడు కాళేశ్వరం అవినీతి ఒక్కటొక్కటిగా బయటపడుతోందన్నారు.