డిసెంబర్ 7న సాయంత్రం LB స్టేడియంలో పడుకుంటా: బండ్ల గణేష్

by GSrikanth |
డిసెంబర్ 7న సాయంత్రం LB స్టేడియంలో పడుకుంటా: బండ్ల గణేష్
X

దిశ, డైనమిక్ బ్యూరో: డిసెంబర్ 9వ తేదీన ఎల్బీ స్టేడియంలో ప్రమాణ స్వీకారం చేసి, అదే రోజు కేబినెట్ భేటీ అయ్యి, ఆరు గ్యారంటీలపై తొలి సంతకం చేస్తామని ఎన్నికల నేపథ్యంలో రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే కాబోయే కాంగ్రెస్ సీఎం ప్రమాణ స్వీకారం కోసం డిసెంబర్ 7 సాయంత్రం నుంచే ఎల్బీ స్టేడియంలో పడుకుంటానని.. దుప్పట్లు కూడా రెడీ చేసుకున్నట్లు ప్రముఖ నిర్మాత, నటుడు బండ్ల గణేష్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడారు.

తెలంగాణలో వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని ధీమా వ్యక్తం చేశారు. ఎవరు కూడా ఊహించని తీరులో కాంగ్రెస్ పార్టీ బంపర్ మెజారీటితో అధికారంలోకి వస్తుందని ఇది వరకే చెప్పినట్లు గుర్తు చేశారు. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో 76 నుంచి 86 వరకు కాంగ్రెస్ పార్టీకి సీట్లు వచ్చే అవకాశం ఉందన్నారు. ఈ నెల 9వ తేదీన ఎల్బీ స్టేడియంలో చప్పట్లు కొడుతూ ఉంటానని, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం ఖాయమన్నారు. తెలంగాణ ఇచ్చిందే కాంగ్రెస్ పార్టీ అని, సోనియా గాంధీ జన్మదినం నాడు అధికారం చేపట్టబోతున్నట్లు వెల్లడించారు.

Advertisement

Next Story

Most Viewed