- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ఢిల్లీ జంతర్‌మంతర్ వద్ద షర్మిల ఆందోళన
దిశ, డైనమిక్ బ్యూరో: ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆందోళనకు దిగారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో భారీ అవినీతి జరిగిందని, దీనిపై సీబీఐ, ఈడీలతో విచారణ చేయించాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా పార్లమెంట్ ముట్టడికి పిలుపునిచ్చి, భారీ ఎత్తున వైఎస్సార్టీపీ నేతలు, కార్యకర్తలతో జంతర్‌మంతర్ నుంచి పార్లమెంట్ వరకు మార్చ్ చేపట్టారు. ‘కేసీఆర్ హఠావో.. తెలంగాణ బచావో’అంటూ నినాదాలతో హోరెత్తించారు. ఈ క్రమంలో జంతర్ మంతర్ వద్ద తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. పార్లమెంట్ ముట్టడికి బయలుదేరిన వైఎస్ షర్మిలను ఢిల్లీ పోలీసులు అరెస్టు చేసి, పార్లమెంట్ పోలీస్ స్టేషన్‌కి తరలించారు. అంతకుముందు మీడియాతో మాట్లాడిన షర్మిల...కాళేశ్వరం ప్రాజెక్టు దేశంలో అతిపెద్ద స్కాం అన్నారు.
కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో సీఎం కేసీఆర్ వేల కోట్ల కమీషన్లు దండుకున్నారని వైఎస్ షర్మిల ఆరోపించారు. కమిషన్ల కోసం రీ డిజైనింగ్ పేరుతో కాళేశ్వరం ప్రాజెక్టులో భారీ అవినీతి జరిగిందన్నారు. రీ డిజైనింగ్ పేరుతో ఒక లక్షా 20 వేల కోట్ల రూపాయలను ప్రాజెక్టుపై ఖర్చు పెట్టి...కేవలం 18 లక్షల 25 వేల 700 ఎకరాలకు మాతమ్రే నీళ్లు ఇచ్చేలా నిర్మాణం చేశారని ఆరోపించారు. నాణ్యత లేకుండా ప్రాజెక్టు నిర్మించారన్న షర్మిల...ప్రతి ఏటా వేల ఎకరాలు మునిగిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. అవసరం లేని దాని మీద లక్షల కోట్లు ఖర్చుపెట్టి అట్టర్ ఫ్లాప్ ప్రాజెక్టుగా మార్చారని ఆహె విమర్శలు గుప్పించారు.