- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
‘కేసీఆర్ ఓ హంతకుడు!’.. వైఎస్ షర్మిల
దిశ, డైనమిక్ బ్యూరో: ముఖ్యమంత్రి కేసీఆర్ పై వైఎస్సార్ టీపీ అధ్యక్షురాలు షర్మిల మరోసారి ఫైర్ అయ్యారు. కేసీఆర్ ఓ హంతకుడని, ఒకే రోజు ముగ్గురిని పొట్టన పెట్టుకున్నాడని ఆరోపించారు. తెలంగాణ బిడ్డలు ప్రాణాలు తీసుకుంటున్నా కేసీఆర్ దొరకు దున్నపోతు మీద వాన పడ్డట్లుగా ఉందని ధ్వజమెత్తారు. ఉద్యోగం లేక శివకుమార్ అనే యువకుడు ఊరేసుకుని చనిపోగా, 20 రోజులైనా వడ్లకు కాంటాలు వేయక రైతు ఎల్లయ్య గుండె ఆగిందని, 15 రోజులుగా సమ్మె చేస్తున్నా సర్కార్ స్పందించక జూనియర్ పంచాయతీ కార్యదర్శి సోని ఆత్మహత్య చేసుకుందన్నారు.
రాష్ట్రంలోని పేదల బిడ్డలు చనిపోతున్నా కనికరించవా కేసీఆర్ అని ప్రశ్నించారు. ఇంకెంత మంది ఉసురు తీసుకుంటావని నిలదీశారు. ‘‘నీ కుటుంబానికి పదవులు, ఆస్తులు సమకూరుతుంటే మా బిడ్డలు పాడె ఎక్కాల్నా’’ అని మండిపడ్డారు. బంగారు తెలంగాణ పేరుతో ఈ రాష్ట్రాన్ని ఆత్మహత్యల తెలంగాణగా మార్చురు. ఇంక మీరు ఎందుకు బతికున్నట్లు కేసీఆర్ అని ఘాటు వ్యాఖ్యలు చేశారు.
KCR హంతకుడు!
— YS Sharmila (@realyssharmila) May 13, 2023
ఒకేరోజు ముగ్గురిని పొట్టన పెట్టుకున్నాడు.
డిగ్రీ చదివి నాలుగేండ్లయినా ఉద్యోగం రాక శివకుమార్ ఉరి వేసుకున్నాడు. 20 రోజులైనా వడ్లకు కాంటాలు వేయక రైతు యల్లయ్య గుండె ఆగింది. 15రోజులుగా సమ్మె చేస్తున్నా.. సర్కారు స్పందించక జీపీ కార్యదర్శి సోనీ తనువు చాలించింది.
1/3