- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
మళ్లీ KCRను సీఎం ఎందుకు చేయాలో చిన్న దొర చెప్పాలి?: Y S Sharmila
దిశ, డైనమిక్ బ్యూరో: స్కీముల పేరిట కేసీఆర్ స్కాములు చేశాడంటూ వైఎస్సార్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల కేసీఆర్‌పై ధ్వజమెత్తారు. శుక్రవారం ట్విట్టర్ వేదికగా ‘పెద్ద దొరను సీఎం ఎందుకు చేయాలో చిన్న దొర’ చెప్పాలంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. రాష్ట్రాన్ని అధోగతి పాలుజేసినందుకు కేసీఆర్‌ను సీఎం చేయమంటావా చిన్న దొర అని కేటీఆర్‌ను విమర్శించారు. కాళేశ్వరం పేరిట లక్ష కోట్లు దోచుకుతిని.. పాలమూరును కట్టకుండా దక్షిణ తెలంగాణను ఏడాది చేసినందుకు వచ్చే ఎన్నికల్లో గెలిపించమంటారా? అని మండిపడ్డారు. 16 వేల కోట్ల మిగులు బడ్జెట్ రాష్ట్రాన్ని.. 4.80లక్షల కోట్ల అప్పులపాలు చేసిన ఘనత కేసీఆర్ దేనంటూ షర్మిల ఆరోపించారు.
రుణమాఫీ, నిరుద్యోగ భృతి, వడ్డీ లేని రుణాలు, కార్పొరేషన్ లోన్లు ఇస్తామని కేసీఆర్ దగా చేసాడన్నారు. దళిత సీఎం, దళితులకు మూడెకరాల భూమి అంటూ నిండా ముంచాడని ఆరోపించారు. డబుల్ బెడ్ రూం ఇండ్లు, పోడు పట్టాలు ఇస్తామని కుచ్చుటోపీ పెట్టాడన్నారు. డిస్కంల దివాళా తీసి, ఆర్టీసీని ఆగంజేసి, ప్రభుత్వ భూములను కొల్లగొట్టాడని మండిపడ్డారు. ఉద్యమకారులను పక్కన పెట్టి, ఉద్యమ ద్రోహులను అక్కున చేర్చుకున్నాడని విమర్శించారు. ‘ఒకప్పుడు జై తెలంగాణ అన్నోడు.. ఇప్పుడు నై తెలంగాణ’ అంటున్నాడని కేసీఆర్‌పై షర్మిల ధ్వజమెత్తారు.
తెలంగాణ తల్లికి ద్రోహం చేసి, తెలంగాణ తల్లి విగ్రహం అంటేనే చీదరించుకుంటున్నాడని వైఎస్ షర్మిల ఆరోపించారు. కేసీఆర్ ముఖ్యమంత్రి కాకపోతే తెలంగాణ తల్లి తల్లడిల్లదు చిన్న దొర అని కేటీఆర్‌పై సెటైర్లు వేశారు. వారి తాలిబన్ల పాలనను చూసి, ఎనిమిదేండ్లుగా తెలంగాణ తల్లి తల్లడిల్లుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. దొరల పాలన విముక్తి కోసం తెలంగాణ ఆశగా ఎదురుచూస్తోందన్నారు. నియంత పాలనను మీ ఫాంహౌజ్‌కే పరిమితం చేయడానికి తెలంగాణ ప్రజానికం సిద్ధంగా ఉన్నదని షర్మిల తీవ్ర విమర్శలు చేశారు.