- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Exit polls: ఎగ్జిట్ పోల్స్ అంచనాలు కరక్టేనా.. 2019లో ఏం జరిగింది?
దిశ, నేషనల్ బ్యూరో: మహారాష్ట్ర (Maharashtra), జార్ఖండ్ (jharkhand) ఎన్నికల పోలింగ్ దాదాపు ముగిసింది. దీంతో ఇప్పుడు అందరి దృష్టి ఎగ్జిట్ పోల్స్ (Exit polls) అంచనాలపైనే ఉంది. పోలింగ్ ముగిసిన వెంటనే రెండు రాష్ట్రాల్లో పలు సంస్థలు ఎగ్జిట్ పోల్స్ ఫలితాలను విడుదల చేస్తాయి. అయితే ఈ అంచనాలు నిజమవుతాయని ఖచ్చితంగా చెప్పలేం. కొన్ని సమయాల్లో ఎగ్జిట్ పోల్స్ ఫలితాలకు, అసలైన ఫలితాలకు చాలా తేడా వచ్చింది. మెజారిటీ సీట్లు గెలుచుకుంటుందని అంచనా వేసిన పార్టీ డీలా పడిపోయిన సందర్భాలూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో అసలు ఎగ్జిట్ పోల్స్ అంటే ఏంటి? వాటిని ఏ విధంగా వెల్లడిస్తారు? 2019లో మహారాష్ట్ర, జార్ఖండ్ ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి ఓ సారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
2019లో మహారాష్ట్ర ఎగ్జిట్ పోల్స్
మహారాష్ట్రలోని 288 స్థానాలకు గాను 2019లో బీజేపీ105 సీట్లు, శివసేన 56, నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ(Ncp) 54, కాంగ్రెస్ (Congress) 44 సీట్లు గెలుచుకున్నాయి. అయితే ఆరు సంస్థలు ఇండియా టుడే-యాక్సిస్, న్యూస్18-ఐపీఎస్‌ఓఎస్, రిపబ్లిక్-జన్ కీ బాత్, టైమ్స్ నౌ, ఏబీపీ న్యూస్, సీ ఓటర్ సంస్థలు నిర్వహించిన సర్వేలో బీజేపీ-శివసేన కూటమికి 213 సీట్లు, కాంగ్రెస్-ఎన్సీపీ కూటమికి 61 సీట్లు వస్తాయని అంచనావేశాయి. కానీ బీజేపీ 105 సీట్లు గెలుచుకుని అతిపెద్ద పార్టీగా అవతరించింది. అంటే అన్ని సంస్థలు అప్పటి ఎన్డీఏ కూటమి విజయం సాధిస్తుందని తెలిపాయి. అనుకున్నట్టుగానే ఎన్డీఏ అలయెన్స్ మెజారిటీ స్థానాలకు కైవసం చేసుకుంది. అనంతరం పలు కారణాల వల్ల కూటమి విడిపోయి కాంగ్రెస్, శివసేన, ఎన్సీపీలు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి.
జార్ఖండ్
జార్ఖండ్ ఎన్నికలు 2019 నవంబర్ 30, డిసెంబర్ 20 తేదీల్లో జరిగాయి. కాంగ్రెస్, జార్ఖండ్ ముక్తి మోర్చా(JMM)తో కూడిన యునైటెడ్ ప్రోగ్రెసివ్ అలయన్స్ (UPA) ఎన్నికల్లో విజయం సాధించింది. జేఎంఎం 30, బీజేపీ 25, కాంగ్రెస్ 16 సీట్లు గెలుచుకున్నాయి. ఇండియా టుడే-యాక్సిస్ మై ఇండియా యూపీఏ 43 సీట్లు గెలుస్తుందని, బీజేపీ 27 సీట్లు గెలుచుకుంటుందని అంచనావేయగా, ఏబీపీ సీ ఓటర్ హంగ్ అసెంబ్లీని అంచనా వేసింది. యూపీఏకు 44, బీజేపీకి 28 సీట్లు వస్తాయని టైమ్స్ నౌ వెల్లడించింది. ఈ మూడు సర్వే సంస్థల సర్వే దాదాపుగా అసలు ఫలితాలకు దగ్గరగా ఉంది. దీంతో రెండు రాష్ట్రాల్లోనే సర్వే సంస్థలు విజయం సాధించాయని చెప్పొచ్చు.
వాట్ ఈజ్ ఎగ్జిట్ పోల్స్?
ఎన్నికల కన్నా ముందే పలు సంస్థలు రాష్ట్రంలోని పలువురు ఓటర్ల నుంచి తమ అభిప్రాయాన్ని సేకరించి ఒక అంచనాతో నివేదికను రూపొందిస్తారు. దీనినే ఎగ్జిట్ పోల్స్‌గా పిలుస్తున్నారు. అయితే పోలింగ్ ముగిసిన అనంతరం మాత్రమే వీటిని వెల్లడించాలి. కాగా, ఇటీవలి హర్యానా ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధిస్తుందని చాలా ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. కానీ అక్కడ ఫలితం మాత్రం భిన్నంగా వచ్చింది.