- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
YSRTP: పార్టీ విలీనంపై షర్మిల కీలక వ్యాఖ్యలు
- అన్ని పార్టీల నుంచి ఫోన్ కాల్స్ వస్తున్నాయి
- తెలంగాణలో వైఎస్సార్ టీపీ ఒక ఫోర్స్
- ప్రస్తుతానికి మేం ఛార్జింగ్ మోడ్ లో ఉన్నాం
- బీఆర్ఎస్ ను బొంద పెట్టుడు ఖాయం
దిశ, డైనమిక్ బ్యూరో: వైఎస్సార్ టీపీ పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేయబోతున్నారంటూ వస్తున్న వార్తలను ఆ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఖండించారు. విలీనమే చేయాలనుకుంటే పార్టీ ఎందుకు పెడతానన్నారు. తాను వెళ్లి ఏదైనా పార్టీలో విలీనం చేయాలని భావిస్తే వద్దనే వాళ్లే లేరని, అయినా పార్టీని విలీనం చేయడానికి స్థాపించలేదని చెప్పారు. మంగళవారం లోటస్ పాండ్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు.
పార్టీ విలీనం, రాబోయే ఎన్నికల్లో పొత్తుల అంశంపై పలు విషయాలను వైఎస్ షర్మిల వెల్లడించారు. వైఎస్సార్ టీపీ కాంగ్రెస్‌లో విలీనం లేదా పొత్తు పెట్టుకోబోతోందనే ప్రచారంపై రియాక్ట్ అవుతూ.. కాంగ్రెస్ పార్టీకి 2014, 2018లో ఎన్ని సీట్లు వచ్చాయో అందరికి తెలుసని, సొంత ఎమ్మెల్యేలను కాపాడుకోలనే స్థితిలో కాంగ్రెస్ ఉందని విమర్శించారు. ఇది ఆ పార్టీ నాయకత్వ లోపమేనని దుయ్యబట్టారు. కాంగ్రెస్ ౼ వైఎస్సార్ = 0 ఇది కాంగ్రెస్ పరిస్థితి అని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్‌కు గతంలో లీడర్ షిప్ ఉండేదని, కానీ వారికి ఇప్పుడు ఆ సత్తా లేదన్నారు.
తెలంగాణలో వైఎస్సార్‌టీపీ ఒక ఫోర్స్ అని, తాను పార్టీ పెట్టుకుని ఇతరుల మాదిరిగా దొంగ పాదయాత్రలు చేయలేదన్నారు. 45 డిగ్రీల ఎండలోనూ ప్రజా సమస్యల కోసం నడిచానని గుర్తు చేశారు. సోనియా గాంధీతో సమావేశం అయ్యారని ప్రచారం జరుగుతోందనే ప్రశ్నకు స్పందిస్తూ ఇది ఎన్నికల సంవత్సరం కావడంతో అన్ని పార్టీల నుంచి ప్రయత్నాలు జరుగుతాయని, తమకు కూడా ఇతర పార్టీల నుంచి ఫోన్ కాల్స్ వస్తున్నాయని చెప్పారు. తాను ఎవరి ఫోన్ లిఫ్ట్ చేయడం లేదని, లిఫ్ట్ చేసినప్పుడు మొదట మీడియాకు కచ్చితంగా చెబుతాన్నారు. మత, కుట్ర రాజకీయాలకు కర్ణాటక ప్రజలు చెంపపెట్టులాంటి తీర్పు ఇచ్చారని, డీకే శివకుమార్ సమర్థవంతమైన నాయకుడు కావడం వల్లే అక్కడ కాంగ్రెస్ గెలిచిందన్నారు. డీకేతో తమకు ముందునుంచే అనుబంధం ఉందని అందువల్లే ఆయనతో భేటీ అయి మనస్పూర్తిగా అభినందించానన్నారు.
వచ్చే ఎన్నికల్లో బీఆరెస్ పార్టీకి డిపాజిట్ అయినా వస్తుందో లేదో చూసుకోవాలని షర్మిల ఎద్దేవా చేశారు. రాష్ట్ర ప్రజలు బీఆర్ఎస్‌ను బొంద పెట్టడం ఖాయమన్నారు. ఈ ప్రభుత్వం టీఎస్ పీఎస్సీ పేపర్ లికేజీ చేసి నిరుద్యోగుల ఆశలు అడియాసలు చేసిందని, ఈ కేసు విచారణను సీబీఐకి అప్పగిస్తే కొడుకు బండారం బయటపడుతుందని కేసీఆర్ భయపడ్డారన్నారు. అందువల్లే విచారణ బాధ్యతలు సిట్‌కు అప్పగించారని ఆరోపించారు. పేపర్ ఫెయిల్యూర్ బాధ్యత ఐటీ శాఖది కాకుంటే ఇంకెవరిదని ప్రశ్నించారు. ప్రతిపక్షాల వల్లే పేపర్ లీకయిందని అధికార పక్షం ఆరోపిస్తోంది. నిరుద్యోగులకు భరోసా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ కేసీఆర్ పేరిట అఫిడవిట్ తయారు చేశామని భవిష్యత్‌లో పేపర్ లీక్ కాదని, పేపర్ చోరీ జరగదని, ఇబ్బందులు తలెత్తకుండా పరీక్షల నిర్వహణ చేస్తామని ఈ అఫిడవిట్ పేపర్‌లో ఉందన్నారు. తెలంగాణ నిరుద్యోగులకు క్షమాపణ చెబుతున్నట్లుగా బాండ్ పేపర్‌లో పొందుపరిచామని, దీనిని కేసీఆర్‌కు పంపిస్తున్నట్లు తెలిపారు. దీనిని ముఖ్యమంత్రి చదవి సంతకం పెట్టాలని వైఎస్ షర్మిల డిమాండ్ చేశారు.