గన్‌పార్క్ వద్ద 10 ప్రశ్నలతో కూడిన పోస్టర్‌ను విడుదల చేసిన వైఎస్ షర్మిల

by Mahesh |   ( Updated:2023-06-01 10:15:16.0  )
గన్‌పార్క్ వద్ద 10 ప్రశ్నలతో కూడిన పోస్టర్‌ను విడుదల చేసిన వైఎస్ షర్మిల
X

దిశ, కార్వాన్: నాంపల్లి‌లోని గన్పార్క్ వద్ద వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు షర్మిల గురువారం తెలంగాణ అమరవీరుల స్థూపానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం కేసిఆర్ పాలనపై 10 ప్రశ్నలతో కూడిన పోస్టర్‌ను విడుదల చేసారు. ఈ సందర్భంగా షర్మిల మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 10 ఏళ్లు గడుస్తున్న రాష్ట్రం అభివృద్ధికి నోచుకోలేదని అన్నారు.

కేసీఆర్ తాము అడిగే 10 ప్రశ్నలకు సమాధానాలు చెప్పాలని డిమాండ్ చేశారు. కెసీఆర్ లక్షల కోట్లు దోచుకున్నారని దేశవ్యాప్తంగా పార్లమెంట్ ఎన్నికలకు ఖర్చు చేసేంత డబ్బు కేసీఆర్‌కు ఎక్కడినుంచి వచ్చిందని అన్నారు. రాష్ట్రం కేవలం లీక్కర్‌లో మాత్రమే అబివృద్ధి చెందిందని, కెసీఆర్ రైతులకు 5000 రైతు బంధు ఇచ్చి మిగతా అన్నింటినీ బంద్ చేశారని, 30 వేల కోట్ల విలువైన భూములను అమ్ముకున్నారని అన్నారు.

రాష్ట్రంలో 36 లక్షల మందికి ఇళ్లు లేవు ఇప్పటి వరకు ఎంత మందికి ఇళ్లు ఇచ్చారని ప్రశ్నించారు. దళిత బంధు లో అవినీతి జరుగుతుందని కేసీఆర్‌కు తెలిసిన కూడా వారిపై చర్యలు ఎందుకు తీసుకోలేదు. 9 ఏళ్లలో రాష్ట్రం సీఎం కుటుంబానికి మాత్రమే బంగారు తెలంగాణ అయ్యిందని, మిగులు బడ్జెట్‌ను అప్పుల కుప్పలుగా కేసిఆర్ మార్చారు. అప్పులు తెచ్చిన డబ్బు ఏమైంది, ఇంత అప్పు చేసిన రుణమాఫీ ఎందుకు చేయలేదు. 70 వేల కోట్ల అవినీతి ఒక్క కాళేశ్వరంలో చేశారు. కేసీఆర్ లక్షల కోట్లు దోచుకున్నారు. కేసిఆర్‌తో బీజేపీ డ్యుయట్ పాడితే కాంగ్రెస్ కేసిఆర్ మోచేయి నీళ్ళు తాగింది. కెసీఆర్‌కు సప్లైంగ్ కంపెనీ లా కాంగ్రెస్ మారింది. ఎట్టి పరిస్థితుల్లో కేసిఆర్‌తో మా పొత్తు ఉండదు, ఎట్టి పరిస్థితుల్లో విలీనం ఉండదు. కాంగ్రెస్ తో పొత్తు ఎందుకు పెట్టుకోవాలి? గెలిచాక వాళ్లు అమ్ముడు పోవడానికా అని వై.ఎస్ షర్మిల ప్రశ్నించారు.

Also Read..

BRS అంటే ‘బరాబర్ రైతు సావు కోరే పార్టీ’: YS షర్మిల ఘాటు విమర్శలు

Advertisement

Next Story