- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కేసీఆర్ బతికుండడం దేనికి? Sharmila ఘాటు వ్యాఖ్యలు
దిశ, డైనమిక్ బ్యూరో: సీఎం కేసీఆర్ అన్ని వర్గాలను మోసం చేశారని, ఆయన చేతిలో మోసపోని వర్గం అంటూ తెలంగాణలో ఏదీ లేదని వైఎస్సార్ టీపీ అధ్యక్షురాలు షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికలు ఉన్నప్పుడే సీఎంకు పథకాలు గుర్తుకు వస్తాయని ఫైర్ అయ్యారు. షర్మిల చేపట్టిన ప్రజాప్రస్థానం పాదయాత్ర సోమవారం నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి జంగారెడ్డిపల్లికి చేరుకుంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆమె మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎనిమిదేళ్లుగా అధికారంలో కొనసాగుతున్న ముఖ్యమంత్రి ప్రజలకు ఏం మేలు చేశారని ప్రశ్నించారు.
రాజశేఖర్ రెడ్డి ఆరోగ్య శ్రీ పథకం, ఫీజు రియంబర్స్ మెంట్, పోడు భూములకు పట్టాలు, పేదలకు ఇళ్ల నిర్మాణం ఇలా అనేక సంక్షేమ పథకాలు అమలు చేశారని గుర్తు చేశారు. వలసల జిల్లా అయిన పాలమూరును సశ్యశామలంగా మార్చాలని, వలసలు ఆగాలని ఉమ్మడి పాలమూరు జిల్లా కోసం కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్, బీమా, నెట్టెంపాడు ప్రాజెక్టులు చేసింది రాజశేఖర్ రెడ్డి కాదా అని ప్రశ్నించారు. ఇప్పటి వరకు కేసీఆర్ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును ఎందుకు పూర్తి చేయలేదని నిలదీశారు. ఎక్కువ కమీషన్లు వస్తాయనే కాళేశ్వరం ప్రాజెక్టును పట్టించుకుని పామూరు రంగారెడ్డి ప్రాజెక్టును నిర్లక్ష్యం చేస్తున్నారని ఆరోపించారు.
పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును పూర్తి చేయాలని మహబూబ్ నగర్ జిల్లాలో 24 గంటల పాటు నిరాహార దీక్ష చేస్తానని హెచ్చరించారు. కేసీఆర్ ఎన్నికల్లో ఇచ్చిన ఒక్క హామీ కూడా నెరవేరలేదని విమర్శించారు. స్థానిక టీఆర్ఎస్ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ కంటికి అమాయకుడిలాగా కనిపిస్తూ ఎవరికి కనబడకుండా వందల కొంట్లు సంపాదించుకున్నాడని ఆరోపించారు. జైపాల్ యాదవ్ ఒక్క మంచి పనైనా చేశాడా అని ప్రశ్నించారు. పేదల భూములు లాక్కుని రియల్ సిండికేట్ నడిపిస్తున్నాడని ఆరోపించారు. ఎన్టీఆర్ లాంటి వ్యక్తినే ఓడించిన కల్వకుర్తి నియోజకవర్గం ప్రజలు రాబోయే ఎన్నికల్లో టీఆర్ఎస్ ను ఓడగొట్టాలని అన్నారు. మంచోడు మంచోడు అంటే మంచం కోళ్లు ఎత్తుకు పోయాడనే చందంగా కేసీఆర్ ను మరోసారి గెలిపిస్తే అంతే సంగతి అన్నారు. తెలంగాణలో మహిళలకు చివరకు ఆరేడేళ్ల ఆడపిల్లలు రక్షణ కల్పించలేకపోయిన సీఎం కేసీఆర్ ఎందుకు బతికుండాలని ఉరేసుకుని చావాలంటూ ఘాటు విమర్శలు చేశారు. మహిళ పక్షాన వైఎస్సార్ తెలంగాణ పార్టీ నిలబడుతుందని చెప్పారు. రాజశేఖర్ రెడ్డి బిడ్డను ఆశీర్వదించాలని కోరారు. వ్యవసాయాన్ని పండుగ చేస్తానని, ప్రతి పేద కుటుంబ మహిళకు ఇళ్లు ఇస్తామని హామీ ఇచ్చారు.
Also Read : దళితబంధు విస్తరణపై సర్కార్ కీలక నిర్ణయం.. ఫస్ట్ ఫేజ్‌లో ఎంత మందికో తెలుసా?