- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
నా శరీరాన్ని తాకే వీడియోలు బయటపెట్టలేదు: YS షర్మిల సీరియస్
దిశ, వెబ్‌డెస్క్: వైఎస్సార్టీపీ అధ్యక్షరాలు వైఎస్ షర్మిల చంచల్ గూడ జైలు నుండి విడుదల అయ్యారు. పోలీసులపై దాడి కేసులో షర్మిల సోమవారం అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. షర్మిలను పోలీసులు నాంపల్లి కోర్టులో హాజరుపర్చగా కోర్టు ఆమె 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. దీంతో షర్మిల న్యాయవాదులు బెయిల్ పిటిషన్ దాఖలు చేయగా.. నాంపల్లి కోర్టు ఆమెకు బెయిల్ మంజూరు చేశారు. దీంతో ఇవాళ చంచల్ గూడ జైలు నుండి విడుదలయ్యారు. షర్మిల చంచల్ గూడ్ జైలు నుండి బయటకు వస్తుందన్న విషయం తెలసుకుని వైఎస్సీఆర్టీపీ కార్యకర్తలకు భారీగా జైలు వద్దకు చేరుకుని ఆమెకు స్వాగతం పలికారు.
ఈ సందర్భంగా వైఎస్ షర్మిల మీడియాతో మాట్లాడారు. మహిళా అని చూడకుండా నా మీద పడి దాడి చేశారని ఆమె అన్నారు. తనపై కావాలనే కేసులు పెట్టి వేధిస్తున్నారని ఆరోపించారు. కేసీఆర్ ఎన్ని కేసులు పెట్టిన వైఎస్ రాజశేఖర్ రెడ్డి బిడ్డ వెనక్కి తగ్గేదికాదన్నారు. తెలంగాణ పోలీసులు సీఎం కేసీఆర్‌కు తొత్తులుగా వ్యవహారిస్తున్నారని మండిపడ్డారు. నా శరీరాన్ని తాకే వీడియోలు, పోలీసులు నాపై కన్నెర్ర చేసే వీడియోలు ఎక్కడ బయటపెట్టలేదని.. కొన్ని సెలెక్టడ్ వీడియోలు మాత్రం రిలీజ్ చేశారని తెలిపారు. ఇచ్చిన ఒక్క హామీని అమలు చేయని కేసీఆర్.. ప్రతిపక్షాల గొంతును నొక్కుతున్నారని ఈ సందర్భంగా షర్మిల ఫైర్ అయ్యారు.
Also Read..