- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
సీఎం కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టారు: వైఎస్ షర్మిల
దిశ ,తెలంగాణ బ్యూరో: తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టిన కేసీఆర్ &కో కు రాష్ట్రంలో ఉండే అర్హతే లేదని వైఎస్సార్ తెలంగాణ పార్టీ చీఫ్ వైఎస్ షర్మిల మండిపడ్డారు. బుధవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో ప్రధానికి అడుగు పెట్టే అర్హత లేదంటున్న బీఆర్‌ఎస్ బందిపోట్లకు.. ఎదురెళ్లి మోడీని నిలదీసే దమ్ము మాత్రం లేదని ఎద్దేవా చేశారు. కేసీఆర్ అడగడు.. పీఎం ఇవ్వడు..10 ఏళ్లుగా ఇదే తంతు నడుస్తుందని విమర్శించారు. నిజంగా దొరకు రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యమైతే.. 5 ఏళ్లలో మోడీ వచ్చిన ప్రతిసారి మొహాలు ఎందుకు చాటేశారని ఆమె ప్రశ్నించారు. విభజన హామీల సంగతి ఏంటని ఎందుకు ప్రశ్నించలేదన్నారు.
తెలంగాణకు దక్కాల్సిన నిధులపై ఎందుకు నిలదీయలేదని ప్రశ్నించారు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు అనుమతులపై చేసిన పోరాటాలు ఎక్కడ చేశారో తెలపాలన్నారు. కేంద్రం ఇస్తామన్న 2 కోట్ల ఉద్యోగాల్లో రాష్ట్ర వాటా ఏదని అడిగారా? బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ, ములుగు గిరిజన విశ్వవిద్యాలయం, కాజీపేట కోచ్ ఫ్యాక్టరీల సంగతిపై పోరాడారా? అని ఆమె ప్రశ్నించారు. ఏటా బడ్జెట్లో రాష్ట్రానికి మొండి చేయి ఇస్తుంటే.. బిఆర్ఎస్ ఎంపీలు చేతకాని దద్దమ్మల మిగిలిపోయారని విమర్శించారు. గల్లీలో కుస్తీ, ఢిల్లీలో దోస్తీ ఇదే "బీజేపీ రాష్ట్ర సమితి" దోస్తానా. అని అన్నారు. దొరకు కుటుంబ క్షేమంపై ఆరాటం తప్ప రాష్ట్ర ప్రజల సంక్షేమంపై సోయి రాదన్నారు. కేసుల నుంచి తప్పించుకునేందుకు మోడీ వద్ద మోకరిల్లడని షర్మిల ఘాటు విమర్శలు చేశారు .