- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
'మా డిమాండ్లు పరిష్కరించకపోతే ఇక్కడే చనిపోతాం'
దిశ, మర్రిగూడ: తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని చర్లగూడెం ప్రాజెక్టు పరిధిలో భూములు కోల్పోయిన నిర్వాసితులు గత నాలుగు రోజులుగా ఆందోళన చేస్తున్నారు. ఎంతకీ అధికారులు స్పందించకపోవడంతో శుక్రవారం నల్లగొండ జిల్లా మర్రిగూడ మండల చౌరస్తాలో ఉన్నటువంటి 11KV స్తంభం పైకి ఎక్కి నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో మర్రిగూడలో టెన్షన్ వాతావరణం నెలకొంది. ప్రాణాలకు తెగించి ఆమరణ దీక్ష చేస్తున్నా.. ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆరుగురు యువకులు 11KV విద్యుత్ స్తంభం ఎక్కారు. తమ డిమాండ్లు పరిష్కరించకపోతే ఇక్కడే చనిపోతామని హెచ్చరికలు జారీ చేశారు. విషయం తెలుసుకున్న నాంపల్లి సర్కిల్ ఇన్స్పెక్టర్ విఠల్ రెడ్డి, ఎస్సై సైదాబాబు స్తంభం దిగాలని కోరినప్పటికీ యువకులు ససేమిరా అనడంతో గంటసేపు యువకులు స్తంభం మీదనే ఉన్నారు. సీఎం డౌన్.. డౌన్.. అంటూ నినాదాలు చేశారు. సమస్యను ఉన్నతాధికారులకు చేరవేసి పరిష్కరిస్తామని, ప్రాణాలు పోగొట్టుకోవద్దని పోలీసులు మైకుల ద్వారా యువకులను కోరారు. అయినా.. యువకులు స్తంభం దిగకపోవడంతో టెన్షన్ వాతావరణ నెలకొంది.