ట్రాన్స్‌జెండర్‌ను పెళ్లి చేసుకున్న యువకుడు.. ఎక్కడంటే?

by Sathputhe Rajesh |   ( Updated:2023-06-14 07:02:12.0  )
ట్రాన్స్‌జెండర్‌ను పెళ్లి చేసుకున్న యువకుడు.. ఎక్కడంటే?
X

దిశ, గార్ల: ట్రాన్స్ జెండర్ ను ఓ యువకుడు వివాహం చేసుకున్నాడు. ఈ ఘటన మహబూబాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది. గార్ల మండలం స్థానిక అంజనాపురం గ్రామానికి చెందిన బానోత్ రాధిక(28) డోర్నకల్ మండలం సిగ్నల్ తండాకు చెందిన ధారావత్ వీరు (30) అనే వ్యక్తి ప్రేమించుకున్నారు. గార్ల మండలం మర్రిగూడెం గ్రామంలోని శ్రీ వేట వెంకటేశ్వర స్వామి దేవాలయంలో బుధవారం ఆదర్శ వివాహం చేసుకున్నారు.

బానోత్ రాధిక ట్రాన్స్ జెండర్ కాగా, ట్రైన్లో వీరు పరిచయం అయ్యాడు. ఇది కాస్త ప్రేమగా మారింది. 2 సంవత్సరాలు ప్రేమించుకున్న వీరు పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు. ఈ సందర్భంగా ట్రాన్స్ జెండర్ అధ్యక్షులు మాట్లాడుతూ సమాజంలో మమ్ముల్ని కూడా గుర్తించాలన్నారు. ఇలాంటి ఆదర్శ వివాహాలు మరిన్ని జరగాలని కోరుకున్నారు. ప్రభుత్వం మమ్మల్ని గుర్తించి మాకు కూడా కల్యాణ లక్ష్మి అందజేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ట్రాన్స్ జెండర్ శోభ, రాధిక, దుర్గ, నందు, రవళి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story