ఎన్నాళ్లకెన్నాళ్లకు.. 15 ఏళ్ల తరువాత యాదాద్రి ఆలయ ఉద్యోగులకు ఝలక్

by Bhoopathi Nagaiah |   ( Updated:2024-08-06 07:28:14.0  )
ఎన్నాళ్లకెన్నాళ్లకు.. 15 ఏళ్ల తరువాత యాదాద్రి ఆలయ ఉద్యోగులకు ఝలక్
X

దిశ, యాదాద్రి భువనగిరి ప్రతినిధి : యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో మంగళవారం ఉద్యోగుల బదిలీలు జరిగాయి. ఆలయంలో 26 మంది ఉద్యోగులు రాష్ట్రంలోని ఇతర ఆలయాలకు బదిలీ అయ్యారు. బదిలీ అయిన వారిలో ఇద్దరు ఏఈవోలు, ఆరుగురు సూపరింటెండెంట్లు, ఏడుగురు సీనియర్ అసిస్టెంట్లు, తొమ్మిది మంది జూనియర్ అసిస్టెంట్లు, ఒక సివిల్ ఇంజినీర్ డీఈ, ఒక ఎలక్ట్రికల్ ఏఈ ఉన్నారు. ‌

చివరి సారిగా 2009లో బదిలీలు..

యాదాద్రి ఆలయంలో చివరిసారిగా 2009లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో బదిలీలు జరిగాయి. అప్పటినుంచి యాదాద్రి ఆలయంలో ఇప్పటివరకు బదిలీలు జరగలేదు. చాలా మంది అధికారులకు, పలు విభాగాలలో పనిచేసే ఉద్యోగులకు పదోన్నతులు లభించి యాదగిరిగుట్టలోనే ఉద్యోగాలు చేస్తున్నారు. దాదాపుగా 15 ఏళ్ల తర్వాత, తెలంగాణ ఏర్పడ్డాక తొలిసారిగా బదిలీలు జరిగాయి.

Advertisement

Next Story

Most Viewed