బహిరంగంగా లంచం డిమాండ్ చేసిన యాదగిరిగుట్ట MRO (వీడియో)

by GSrikanth |   ( Updated:2023-10-10 15:43:30.0  )
బహిరంగంగా లంచం డిమాండ్ చేసిన యాదగిరిగుట్ట MRO (వీడియో)
X

దిశ, యాదాద్రి భువనగిరి ప్రతినిధి: యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట ఎమ్మార్వో కార్యాలయంలో బహిరంగంగా వసూళ్లపర్వం కొనసాగుతోంది. ఏకంగా ఎమ్మార్వోనే క్రయవిక్రయాలు జరుపుతున్న వారిని యథేచ్చగా డబ్బులు అడుగుతున్నాడు. వివరాల్లోకి వెళితే.. యాదగిరిగుట్టకు చెందిన ఇద్దరు వ్యక్తులు యాదగిరిగుట్ట ప్రాంతంలో అర ఎకరం, అర ఎకరం చొప్పున ఎకరం భూమిని కొనుగోలు చేశారు. దీనికి సంబంధించిన పాస్ బుక్కుల కోసం ఎమ్మార్వో కార్యాలయానికి వెళ్లారు. స్వయంగా ఎమ్మార్వో శోభన్ బాబు వారిని రూ.5 వేలు కావాలని డిమాండ్ చేశారు.

తమ వద్ద అన్ని పత్రాలు సక్రమంగానే ఉన్నాయని బాధితులు చెప్పగా, ‘మాకు కూడా ప్రోటోకాల్ తదితర ఖర్చులు ఉంటాయి కదా. సరే మీ ఇష్టం’ అంటూ వారికి సమాధానం చెప్పాడు. అనంతరం కాసేపటికి మరోసారి బాధితులు మా వద్ద డాక్యుమెంట్స్ సరిగ్గానే ఉన్నాయని చెప్పడంతో చివరికి పాస్ బుక్కులు ఇచ్చాడు. స్వయంగా ఎమ్మార్వోనే ఇలా బహిరంగంగా డబ్బులు అడగడం పట్ల ప్రజలు ఆశ్చర్యానికి గురవుతున్నారు. ఈ విషయంపై ఉన్నత అధికారులు స్పందించి తగు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

Advertisement

Next Story