తెలంగాణలోని పర్యాటక కేంద్రాలకు ప్రపంచ స్థాయి గుర్తింపు : మంత్రి శ్రీనివాస్ గౌడ్

by Vinod kumar |
తెలంగాణలోని పర్యాటక కేంద్రాలకు ప్రపంచ స్థాయి గుర్తింపు : మంత్రి శ్రీనివాస్ గౌడ్
X

దిశ, తెలంగాణ బ్యూరో: ఫార్మా, ఐటీ, వెల్త్ క్యాపిటల్‌గా హైదరాబాద్ ప్రపంచ స్థాయి గుర్తింపు పొందిందని మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్ స్పష్టం చేశారు. ఐటీవీ, బెర్లిన్‌లో జరుగుతున్న ఇంటర్నేషనల్ టూరిజం కల్చర్ ఎగ్జిబిషన్‌లో ట్రావెల్ అండ్ టూర్ ఆపరేటర్స్‌తో నిర్వహించిన సమావేశంలో మంత్రి పాల్గొని తెలంగాణ పర్యాటక ప్రాంతాల విశిష్టతను వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ శరవేగంగా అభివృద్ధి చెందుతూ.. ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తోందన్నారు. తెలంగాణ సాంస్కృతి, సాంప్రదాయాలు, బతుకమ్మ, బొడ్డెమ్మ పండుగలు ఎంతో ప్రత్యేకమన్నారు. ఇంటర్నేషనల్ టూరిజం అండ్ కల్చర్ ఎగ్జిబిషన్లో తెలంగాణ టూరిజం స్టాల్ పర్యాటకులను టూర్స్ అండ్ ట్రావెల్ ఆపరేటర్లను విశేషంగా ఆకర్షించిందన్నారు.

తెలంగాణలో బుద్ధిజానికి పూర్వ వైభవాన్ని తీసుకొస్తున్నామన్నారు. నాగార్జునసాగర్‌లో బుద్ధవనం ప్రాజెక్టును ప్రపంచ స్థాయిలో నిర్మించామన్నారు. కరోనా సమయంలో ప్రపంచ వ్యాప్తంగా వ్యాక్సిన్లను సరఫరా చేసిన ఘనత హైదరాబాద్ నగరానికి దక్కిందన్నారు. ప్రపంచ వ్యాప్తంగా అత్యుత్తమ వైద్య సేవలు నామమాత్రపు ధరకు అందిస్తున్న నగరంగా హైదరాబాద్‌కు గుర్తింపు లభిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో ఇండియా టూరిజం సెక్రటరీ అరవింద్ సింగ్, భారత రాయబారి పర్వతనేని హరీష్, తెలంగాణ టూరిజం ఎండీ మనోహర్, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed