- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
ఆర్టీసీ బస్సు మాకు నచ్చిన చోట ఆపాలి! చివరికి పోలీసుల దాకా పోయిన పంచాయతీ

దిశ, డైనమిక్ బ్యూరో: టీఎస్ ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం సౌకర్యం కల్పించినప్పటి నుంచి బస్సుల్లో ఏదో ఒక గొడవ జరుగుతూనే ఉంది. సీట్ల విషయంలో గోడవలు, కండెక్టర్, డ్రైవర్‌తో మరో రకమైన మహిళల వాదనలు, సీట్లు దోరకని పురుషుల ఆవేదనలు ఇలా అనేక విధాలుగా ఆర్టీసీ బస్సుల్లో ఈ మధ్య గొడవలు ఎక్కువగా అవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే సోషల్ మీడియాలో చాలా వీడియోలు చక్కర్లు కొడుతున్నాయి. కొన్ని బస్సుల్లో పరిమితికి మంచి ప్రయాణికులను ఎక్కిండంతో ప్రయాణికులు తీవ్ర ఇక్కట్లు సైతం ఎదుర్కొంటున్నారు. తాజాగా మరో వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
కొమురవెల్లి ఆర్టీసీ బస్సు మాకు నచ్చిన చోట ఆపాలని మహిళా ప్రయాణికులు గొడవ పడుతున్నారు. ఎక్కడపడితే అక్కడ ఆపితే పోలీసులు ఫోటోలు తీసి చలాన్లు వేస్తున్నారని డ్రైవర్ ఆవేదన వ్యక్తంచేశారు. దీంతో ఈ పంచాయతీ చివరికి పోలీసుల వరకు వెళ్లింది. పోలీసులు ఏదోలా వారికి నచ్చజెప్పి వారిని అక్కడి నుంచి పంపించివేశారు.