రేవంత్ రెడ్డికి చీర, గాజులు గిఫ్ట్ పంపుతామంటున్న మహిళలు!.. వీడియో వైరల్

by Disha Web Desk 5 |
రేవంత్ రెడ్డికి చీర, గాజులు గిఫ్ట్ పంపుతామంటున్న మహిళలు!.. వీడియో వైరల్
X

దిశ, డైనమిక్ బ్యూరో: సీఎం రేవంత్ రెడ్డికి చీర, గాజులతో పాటు పూలు కూడా బహుమతిగా పంపుతామని మహిళలు అంటున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియోలో కొందరు మహిళలు చీర, గాజులు పట్టుకొని ఉన్నారు. వారు మాట్లాడుతూ.. రేవంత్ రెడ్డి మహిళలకు ఫ్రీ బస్ ఇచ్చానని, ఆరు గ్యారెంటీలు అమలు చేస్తున్నానని, కేటీఆర్ ను చీర, గాజులు పెట్టుకొని బస్ ఎక్కితే గ్యారెంటీలు అమలు అవుతున్నాయో లేదో తెలుస్తుందని రేవంత్ రెడ్డి అంటున్నాడని, ఇదే చీర, గాజులు రేవంత్ రెడ్డి ఇస్తామని ఆయన కట్టుకొని బస్ ఎక్కి ఫ్రీ బస్ పథకం వల్ల బస్సుల్లో మహిళలు పడుతున్న దుస్తితిని చూడాలని చెప్పారు. బస్సుల్లో సీట్ల కోసం కొట్టుకొని చస్తున్నారని, అలాంటి చేదు అనుభవం మాకే ఎదురైందని చెప్పారు.

మేం ఎర్రవరం వెళుతుంటే బస్సులో పైసలు పెట్టి టికెట్ తీసుకోలేదని మమ్మల్ని దింపేశారని వాపోయారు. రైతులు పోలంలో ఆత్మహత్య చేసుకొని చనిపోతుంటే రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నాడని ప్రశ్నించారు. అలాగే ఆరు గ్యారెంటీల్లో మాకు ఒక్క గ్యారెంటీ కూడా అందలేదని, మహిళలు కొట్టుకుచ్చేలా ఒక్క ఫ్రీ బస్ పథకం మాత్రమే పెట్టాడని, మహిళలకు రూ. 2500 రాలేదని, రూ. 500 గ్యాస్ రాలేదని, తులం బంగారం రాలేదని, పించన్ ఇవ్వలేదని తర్వాత ఇస్తాడన్న గ్యారెంటీ కూడా లేదని అన్నారు. నిజంగా ఆరు గ్యారెంటీ అమలు చేస్తాడా? చీర గాజులు పెట్టుకొని బస్ ఎక్కుతాడా? రేవంత్ రెడ్డి చెప్పాలని ప్రశ్నించారు. అయితే ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవ్వగా.. దీనిపై నెటిజన్లు బిన్నంగా స్పందిస్తున్నారు.

Next Story

Most Viewed