- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్ జాక్ పాట్.. పీపుల్స్ పల్స్ - సౌత్ ఫస్ట్ సర్వేలో సంచలన విషయాలు
దిశ, డైనమిక్ బ్యూరో:తెలంగాణలో లోక్ సభ ఎన్నికల హడావుడి మొదలైంది. ప్రధాన పార్టీలన్నీ ప్రచారాస్త్రాలపై దృష్టి సారించాయి. ఈ నేపథ్యంలో రానున్న లోక్ సభ ఎన్నికల్లో తెలంగాణలో ఏ పార్టీకి విజయావకాశాలు ఎలా ఉన్నాయనే దానిపై పీపుల్స్ పల్స్ -సౌత్ ఫస్ట్ సంస్థలు సంయుక్తంగా నిర్వహించిన ట్రాకర్ పోల్ సర్వేలో కీలక విషయాలు వెల్లడయ్యాయి. ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఏకంగా 8 నుంచి పది పార్లమెంట్ స్థానాలు కైవసం చేసుకుని అగ్రస్థానంలో నిలవబోతున్నట్లు ఈ సర్వే వెల్లడించింది. ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న బీఆర్ఎస్ 3 నుంచి 5 స్థానాలకే పరిమితం కాబోతున్నదని బీజేపీ 2 నుంచి 4 సీట్లు, ఇతరులు 1 స్థానం గెలిచే అవకాశం ఉందని అంచనా వేసింది. అధికార పార్టీ అనే ట్యాగ్ లైన్ కాంగ్రెస్ కు, మోడీ ఆధరణ బీజేపీకి కలిసి రానున్నట్లు పేర్కొంది. తెలంగాణలో లోక్‌సభ ఎన్నికలపై 11 ఫిబ్రవరి నుండి 17 ఫిబ్రవరి వరకు ట్రాకర్ పోల్ సర్వేను నిర్వహించారు. ఈ సర్వే కోసం ప్రతీ పార్లమెంట్ నియోజకవర్గంలో 3 అసెంబ్లీ సెగ్మెంట్లల్లో 4,600 శాంపిల్స్ సేకరించారు.
మరింత మైనస్ లోకి బీఆర్ఎస్:
ఈసారి ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి 40 శాతం, బీఆర్ఎస్ కు 31 శాతం, బీజేపీకి 23 శాతం, ఇతరులు 6 శాతం ఓట్లు కైవసం చేసుకునే అవకాశం ఉందని పేర్కొంది. అయితే గత అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే కాంగ్రెస్ 1 శాతం, బీజేపీ 9 శాతం ఓట్లు అధికంగా కైవసం చేసుకుంటుండగా ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న బీఆర్ఎస్ మాత్రం 6 శాతం ఓట్లను కోల్పోబోతున్నదని ఈ సర్వే తేల్చింది.
కాంగ్రెస్ కు కలిసిరాబోతున్న మహాలక్ష్మి స్కీమ్:
అధికారంలోకి వచ్చిన వెంటనే కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించేందుకు అమలు చేస్తున్న మహాలక్ష్మి స్కీమ్ ఆ పార్టీకి కలిసిరాబోతున్నదని ఈ సర్వే వెల్లడించింది. లోక్ సభ ఎన్నికల్లో ఆ పార్టీకి మహిళల్లో ఎక్కువ మద్దతు ఉన్నట్లు పేర్కొంది. కాంగ్రెస్ పార్టీకి గ్రామీణ ప్రాంతాల్లో 42 శాతం ఆదరణ ఉండగా పట్టణ ప్రాంతాల్లో 37 శాతం ఆదరణ ఉందని తెలిపింది. ట్రాకర్ పోల్ అంచనా ప్రకారం అన్ని పోల్ పారామీటర్లలో వయస్సు సమూహాలు, కమ్యూనిటీలు, లింగం, ప్రాంతాలలో కాంగ్రెస్ తన ప్రత్యర్థులపై ఆధిక్యాన్ని కొనసాగించనున్నది.లోక్‌సభ ఎన్నికల కోసం ముస్లింలు బీఆర్‌ఎస్ నుండి కాంగ్రెస్‌లోకి మారుతున్నట్లు కనిపిస్తోందని, 52 శాతం మంది కాంగ్రెస్ పార్టీకే ప్రాధాన్యత ఇస్తున్నారని తేలింది. ముస్లిం ఓట్లలో బీఆర్‌ఎస్ వాటా 38 శాతానికి పడిపోయిందని పేర్కొంది.
మోడీకే జై:
ప్రధానిగా ఎవరుండాలనేదానిపై నిర్వహించిన సర్వేలో 34 శాతం మంది మోడీకే జైకొట్టినట్లు ఈసర్వే పేర్కొంది. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి 23 శాతం, ప్రియాంక గాంధీకి 11 శాతం, మమతాబెనర్జీకి 10 శాతం, అరవింద్ కేజ్రీవాల్ కు 7 శాతం, ఇతరులను 14 శాతం మంది ఎంచుకున్నట్లు తెలిపింది.