మునుగోడులో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఎంట్రీ ఇస్తారా? నేటితో ఫుల్ క్లారిటీ

by Sathputhe Rajesh |   ( Updated:2022-09-03 08:02:05.0  )
మునుగోడులో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఎంట్రీ ఇస్తారా? నేటితో  ఫుల్ క్లారిటీ
X

దిశ, డైనమిక్ బ్యూరో: టీ-కాంగ్రెస్ లో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఎపిసోడ్ కు ఫుల్ స్టాప్ పడినట్లేనా? ఇవాళ్టితో ఈ ప్రశ్నకు సమాధానం దొరకనుందా? హస్తం పార్టీలో ఇప్పుడిదే హాట్ టాపిక్ గా మారింది. ఉపఎన్నిక నేపథ్యంలో శనివారం కాంగ్రెస్ సీనియర్లు మునుగోడు బాట పట్టనున్నారు. పార్టీలో నేతల మధ్య మంచి సంబంధాలు ఉన్నాయని ఐక్యతను చాటి చెప్పేందుకు టీపీసీసీ భావిస్తున్న వేళ.. సీనియర్లకు ఆహ్వానాలు అందాయి. నల్గొండ జిల్లాకు చెందిన జానారెడ్డి, ఉత్తమ్, కోమటిరెడ్డిలకు ఈ రోజు జరగనున్న ఇంటింటికి కాంగ్రెస్ కార్యక్రమంలో పాల్గొనాలని పిలిచారు. వీరిలో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, జానారెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీ గౌడ్ లు హాజరుకానుండగా.. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి హాజరుపై ఇంకా క్లారిటీ రాకపోవడం పార్టీ శ్రేణుల్లో ఉత్కంఠగా మారింది.


ఈ రోజు తేలిపోనుందా?

సిట్టింగ్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ ను వీడి బీజేపీలో చేరడంతో హస్తం పార్టీలో కల్లోలం ఏర్పడింది. తన సోదరుడు పార్టీని వీడటంతో వెంకట్ రెడ్డి సైతం పార్టీకు గుడ్ బై చెప్పబోతున్నట్లు ప్రచారం జరిగింది. కానీ తాను పార్టీని వీడబోయేది లేదని ఆయన బదులిస్తూ వస్తున్నారు. రాజగోపాల్ రెడ్డి ఎపిసోడ్ తర్వాత ఏర్పడిన పరిణామాలతో వెంకట్ రెడ్డి పార్టీ కార్యక్రమాలకు దూరం అయ్యారు. ఆయన సొంతంగా పర్యటనలు చేస్తూ ప్రజలను కలుస్తున్నారు.

ఈ క్రమంలో ఇవాళ 'ఇంటింటికి కాంగ్రెస్' పేరుతో పీసీసీ కీలక కార్యక్రమానికి పిలుపునిచ్చింది. అలాగే వరంగల్ డిక్లరేషన్ ను ప్రజలకు చేరవేస్తామని చెబుతోంది. టీఆర్ఎస్, బీజేపీపై ఛార్జ్ షీట్ వేస్తామని ప్రకటించింది. ఈ రోజు కీలక ప్రెస్ మీట్ నిర్వహిస్తామని ఇప్పటికే పీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈ ప్రెస్ మీట్ కు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సైతం హాజరు అవుతారని, గతంలోనే రేవంత్ ప్రకటించారు. కానీ ఆయన వస్తారా? లేదా? అనేది మాత్రం సస్పెన్స్ గా మారింది. ప్రియాంక గాంధీతో భేటీ తర్వాత వెంకట్ రెడ్డి మాటలో తేడా వచ్చింది. మునుగోడు ప్రచారానికి వస్తానని ప్రకటన చేశారు. అయితే ఇవాళ్టి సభకు హాజరు అయి తాను పార్టీలోని మిగతా నాయకులతో కలిసి పని చేస్తానని చాటి చెబుతారాఝ లేక ఏదైనా సాకు చూపి ఎగ్గొడతారా? అనేది తేలాల్సి ఉంది.

Advertisement

Next Story

Most Viewed