- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కవిత తప్పు చేయకుంటే భయమెందుకు? : DK Aruna
దిశ, తెలంగాణ బ్యూరో : ఎమ్మెల్సీ కవిత ఎలాంటి తప్పు చేయకుంటే భయమెందుకని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ అన్నారు. ఈ విషయంలో ఎమ్మెల్యేలు ఎందుకు ఆందోళన చెందుతున్నారోనని ఆదివారం ఒక ప్రకటనలో ఆమె ఎద్దేవా చేశారు. కేసీఆర్ పేరు చెప్పుకుని గెలిచిన నాయకులు, ముఖ్యమంత్రి మెప్పు కోసం రాజకీయ కక్షతో బీజేపీపై విమర్శలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తప్పు చేసే వారు భయపడుతారని, ఎలాంటి తప్పు చేయని వారు అసలే భయపడరని పేర్కొన్నారు. పచ్చ కామెర్లు వచ్చినోడికి లోకమంతా పచ్చగా కనిపించినట్లు.. బీఆర్ఎస్ నేతల తీరు మారిందని ఫైరయ్యారు. కవిత ఎలాంటి తప్పు చేయకుంటే ఆమె, తండ్రి, అన్న, కుటుంబీకులు భయపడాల్సిన అవసరం లేదని, నేతలు ఆమెను వెనకేసుకు రావాల్సిన అవసరం అంతకన్నా లేదన్నారు. కానీ కొందరు ఎమ్మెల్యేలు వచ్చే ఎన్నికల్లో ఎక్కడ తమకు సీట్లు రాకుండాపోతాయోననే భయంతో మద్దతు తెలుపుతున్నారని వెల్లడించారు.
ప్రజా సంక్షేమం గురించి ఈ ఎమ్మెల్యేలకు సోయి లేదని, అభివృద్ధి గురించి, ప్రజలకు ఇచ్చిన హామీల గురించి మాట్లాడే శక్తి లేదని వ్యాఖ్యానించారు. కానీ కేసీఆర్ తానా అంటే ఎప్పుడు తందానా అనాలా అని ఎదురుచూస్తుంటారని కామెంట్లు చేశారు. రాజకీయ కక్ష అనేది బీఆర్ఎస్ నేతలకున్న ఆలోచన అని, అందుకే అందరూ అలాగే ఉన్నారని భావిస్తున్నారని ధ్వజమెత్తారు. ఈడీ, సీబీఐ బీజేపీ చెప్పినట్లు చేస్తున్నాయని విమర్శలు చేస్తున్నారని, వాస్తవానికి ఇక్కడున్న పోలీసులు బీఆర్ఎస్ నేతల జేబులో ఉన్నారని, వారు చెప్పినట్లే చేస్తారని, అందుకే ఈడీ, సీబీఐ కూడా వారికి ఇలా కనిపిస్తోందని సెటైర్లు వేశారు. లేనిపోని కేసుల్లో ఇరికించడం, బెదిరించడం బీఆర్ఎస్ నేతలకున్న అర్హత అని ఘాటు విమర్శలు చేశారు. ఎమ్మెల్యేలు తెలంగాణ ప్రజల మెప్పు కోసం, వారికిచ్చిన హామీలను నెరవేర్చడం కోసం పనిచేయాలని, అంతేకానీ కేసీఆర్ మెప్పు కోసం మాట్లాడొద్దన్నారు.