- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Sale of a child: చట్టమా..? మానవత్వమా..? ఎవరి తప్పుకి ఎవరికి శిక్ష..?
దిశ వెబ్ డెస్క్: నవమాసాలు మోయలేదు, పురిటినొప్పులు పడలేదు, కానీ ఊహ తెలియని పసికందులకు తల్లిదండ్రులయ్యారు. ప్రాణానికి ప్రాణంగా పెంచుకుంటున్నారు. ఆ చిన్నారులు సైతం వాళ్లే తమ అమ్మానాన్న అనుకుంటున్నారు. అంతా సజావుగా సాగుతున్న సమయంలో శిశువుల విక్రయానికి సంబంధించి అంతర్రాష్ట్రముఠాను హైదరాబాద్ నగర శివార్లలోని మేడిపల్లి పోలీసులు అరెస్ట్ చేశారు అనే వార్త వెలుగు చూసింది.
ఆ వార్త అప్పటి వరకు సంతోషంగా ఉన్న తల్లిదండ్రుల జీవితాల్లను తలకిందులు చేసింది. సెంట్రల్ ఆడాప్షన్ రిసోర్స్ అథారిటీ (కారా) నిబంధనలకు విరుద్ధంగా దత్తత తీసుకొని తప్పు చేశారంటూ అధికారులు మొత్తం 14 మంది పిల్లలను బలవంతంగా తల్లిదండ్రుల దగ్గర నుండి బలవంతంగా తీసుకు వెళ్లారు. దీనితో ప్రాణానికి ప్రాణంగా పెంచుకుంటున్న పిల్లలు దూరం కావడంతో ఆ తల్లిండ్రులు తల్లడిల్లుతుంటే.. వాళ్లే తమ అమ్మ నాన్న అని అనుకుంటున్న ఆ చిన్నారులు, తమ బాధను తెలపలేక బెంగతో జ్వరం బారిన పడుతున్నారిని సమాచారం.
ప్రాదేయపడుతున్న తల్లిదండ్రలు.. మొండిపట్టు వీడని అధికారులు..
ప్రాణానికి ప్రాణంగా పెంచుకున్న పిల్లలను తమ నుండి దూరం చేయడంతో ఆ తల్లిదండ్రులు తల్లడిల్లిపోతున్నారు. తమ బిడ్డల్ని ఒక్కసారి చూపించండి అంటూ అధికారులను తల్లిదండ్రులు ప్రాధేయపడూ గత మూడు రోజులుగా యూసుఫ్‌గూడలోని శిశువిహార్ పరిసరాల్లో తల్లిదండ్రులు ఎదురుచూస్తున్నారు. తమూ చేసింది తప్పే.. కాని మా బిడ్డలు లేకుండా మేం బతకలేం అని కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.
అయినా అధికారుల మనసు కరగడం లేదు. పిల్లలను ఇచ్చే సమస్యేలేదని తేల్చి చెబుతున్నారు. హైదరాబాద్ జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారి ఇండ్ల అక్కేశ్వరరావు మాట్లాడులూ.. పిల్లల్ని పెంచుకోవాలనుకునే పిల్లలు లేని దంపతులు అక్రమ మార్గంలో కొనుగోలు చేయకూడదని తెలిపారు. పిల్లల్ని పెంచుకోవాలనుకుంటే దరఖాస్తు చేసుకొని చట్టబద్ధంగా దత్తత తీసుకోవాలని సూచించారు.
కాగా రూల్స్‌కు విరుద్దంగా పిల్లల్ని కొన్న తల్లిదండ్రల దగ్గర నుండి తీసుకువచ్చిన పిల్లలను శిశువిహార్ కు తరలించినట్టు తెలిపారు. ఇక ప్రస్తుతం శిశువిహార్ లో 200మంది చిన్నారులున్నారని, వారిని సెంట్రల్ అడాప్ట్ ఏజెన్సీ ద్వారా దరఖాస్తు చేసుకున్న వారికి దత్తత ఇస్తామని అక్కేశ్వరరావు వివరించారు.
తెలుగు రాష్ట్రాల్లో శిశువులకు డిమాండ్ పెరగడాని కారణం ఏంటి..?
పిల్లలు లేని దంపతులు అనాథ పిల్లలను దత్తలు తీసుకోవాలంటే ఇతర రాష్ట్రాల్లో కేవలం 6 నేలల సమయం పడుతుంది. కాని తెలుగు రాష్ట్రాల్లో అనాథ పిల్లలను దత్తలు తీసుకోవాలంటే సుమారు 2 సంవత్సరాలు పడుతోంది. దీనితో పిల్లలను నిబంధనలకు విరుద్దంగా కొనుకుంటున్నారు.
పిల్లపై తీవ్ర ప్రభావం చూపనున్న అధికారుల నిర్ణయం..
రూల్స్‌కు విరుద్దంగా పిల్లలను కొనుకున్నా, ప్రాణంలా చూసుకుంటున్నారు ఆ తల్లిదండ్రులు. దీనితో వాళ్లే తమ అమ్మానాన్న అని అ పిల్లలు భావిస్తున్నారు. పైగా ఈ పిల్లల్లో శిశువుల నుండి రెండుమూడు సంవత్సరాల వయసున్న పిల్లలు కూడా ఉన్నారు. అయితే ప్రస్తుతం ఆ పిల్లలను తల్లిదండ్రుల దగ్గర నుండి వేరు చేయడం ఆ పిల్లలపై తీవ్ర ప్రభావాన్ని చూపే అవకాశం ఉందని నిపుణులు తెలిపుతున్నారు.
2 నుండి 3 సంవత్సరాల వయసున్న పిల్లలు తాము ఏం మిస్ అవుతున్నారో చెప్పలేరు కనుక వస్తువులను పగల గొట్టడం వంటి చర్యలు పాల్పడుతూ అగ్రసివ్‌గా మారే అవకాశం ఉందని, అలానే ఊహ తెలియని శిశువులు సైతం తల్లికి దూరం అయితే బెంగతో వ్యాదుల భారినపడే అవకాశం ఉందని నిపుణులు పేర్కొంటున్నారు.
ఎవరి తప్పుకి ఎవరికి శిక్ష..?
అక్రమంగా శిశువులను విక్రయించి నేరస్తులు తప్పుచేశారు. నిబంధనలకు విరుద్దంగా పిల్లల్ని కొని తల్లిందండ్రులు తప్పు చేశారు. మరి ఏ తప్పు చేశారని పిల్లలని తల్లిదండ్రుల దగ్గర నుండి వేరుచేసి వాళ్లను మానసిక క్షోభకు గురిచూస్తున్నారు. కన్న తల్లిదండ్రుల ఎలా ఉంటారో ఆ పిల్లలకు తెలీదు. పోలీసులు వచ్చి తీసుకు వెళ్లినా తమని ఎందుకు తీసుకువెళ్లారో ఈ పసిహృదయాలకు అర్థం కావడం లేదు.
తమని పెంచ్చిన వాళ్లే తమ తల్లిదండ్రులు అని ఆ పసి పిల్లలు అనుకుంటున్నారు. నిన్నటి వరకు అమ్మానాన్నల ముందు అల్లరి చేసిన ఆ పిల్లలు, ఇప్పుడు వాళ్లకు దూరమై బాధను వ్యక్త పరచలేక వాళ్లలో వాళ్లే కుల్లికుల్లి ఏడుస్తున్నారు. ఏం తప్పు చేశారని ఈ పిల్లలకు శిక్ష వేశారని, పెంచ్చిన వాళ్లే తమ అమ్మానాన్న అని వాళ్ల కోసం ఆ పిల్లలు ఏడుస్తుంటే కాస్తైనా జాలి కలగడం లేదా..? చట్టం ముసుగులో మానవత్వాన్ని మర్చిపోయారా అని పలువురు అధికారుల కాఠిన్యాన్ని విమర్శిస్తున్నారు.