chamala kiran kumar: కేసీఆర్ రాజకీయాల్లో ఉన్నారో లేదో తెలియడం లేదు.. చామల కిరణ్ సెటైర్

by Prasad Jukanti |
chamala kiran kumar: కేసీఆర్ రాజకీయాల్లో ఉన్నారో లేదో తెలియడం లేదు.. చామల కిరణ్ సెటైర్
X

దిశ, డైనమిక్ బ్యూరో: రాజీనామా చేయాలని హరీశ్ రావును అడిగితే నాటకాలాడుతున్నారని కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి విమర్శించారు. పదేళ్లు అధికారంలో ఉన్నప్పుడు కేసీఆర్ ఎందుకు రుణమాఫీ చేయలేదని ప్రశ్నించారు. తాము అధికారంలోకి వచ్చిన 8 నెలల్లోనే రుణమాఫీ చేశామన్నారు. కేసీఆర్ గతంలో రుణమాఫీ పేరుతో రెండు సార్లు రైతులను మోసం చేశారని వారి హయాంలో మీరిచ్చిన రుణమాఫీ వడ్డీలకు కూడా సరిపోలేదన్నారు. అబద్ధాలు చెబుతూ బీఆర్ఎస్ నేతలు తెలంగాణ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని దుయ్యబట్టారు. శనివారం గాంధీ భవన్ లో మీడియాతో మాట్లాడిన చామల.. బీఆర్ఎస్ దౌర్భాగ్యపు పాలన వల్ల రాష్ట్ర ఖజానా పూర్తిగా దివాళా తీసిందన్నారు. బీఆర్ఎస్ హయాంలో చీకటి జీవోలు ఇచ్చి ఎంత కొల్లగొట్టిన తెలుసుకునేందుకే మా ప్రభుత్వానికి నెల రోజుల సమయం పట్టిందన్నారు. మళ్లీ సిగ్గులేకుండా ప్రతిరోజు ప్రెస్ మీట్లు పెట్టు ఎలా మాట్లాడురున్నారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రం నెత్తిమీద రూ.7 లక్షల కోట్ల అప్పుల భారం మోపిన బీఆర్ఎస్ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన 5 నెలలు కాకముందే అన్ని సమస్యలు తీర్చాలంటూ నవ్వులాటలా మీ ప్రెస్ మీట్లు ఏంటని నిలదీశారు.

కేసీఆర్ రాజకీయాల్లో ఉన్నారో లేదో:

ప్రాంతీయ పార్టీలపై అధ్యయనం చేద్దామనుకుంటే మిమ్మల్ని బీజేపీ ఫుట్ బాల్ ఆడుకుంటున్నదని చామల సెటైర్ వేశారు. బీఆర్ఎస్ బీజేపీతో సంసారం చేద్దామనుకుంటే వాళ్లేమో దాన్ని తిరస్కరిస్తున్నారని విమర్శించారు. రాత్రికి రాత్రి అమెరికా నుంచి ఊడిపడి ఉద్యమకారుడి టికెట్ ను లాక్కున్న కేటీఆర్ కు సీఎం రేవంత్ రెడ్డి గురించి మాట్లాడే అర్హత లేదన్నారు. ఆ అర్హత మీ నాన్న కేసీఆర్ కు ఉన్నప్పటికీ ఆయన రాజకీయాల్లో ఉన్నారో లేదో తెలియడం లేదని ఎద్దేవా చేశారు. కేటీఆర్ సీఎం గురించి మాట్లాడే ముందు కేసీఆర్ వద్ద నుంచి అపోజిషన్ లీడర్ పదవిని తీసుకోవాలన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నా ఆయనకు బదులు కేటీఆరే విదేశాలకు వెళ్లారని, ప్రతిపక్ష నాయకుడు ఉన్నా ఆయనకు బదులు కేటీఆరే మాట్లాడాతున్నారని దుయ్యబట్టారు. పదేళ్లు అధికారంలో ఉండి జీవితాతం అధికారంలో ఉంటామన్న పిచ్చి ఆలోచనతో బతికిని మీకు దేశంలోని ప్రాంతీయ పార్టీలను అధ్యయనం చేయాలనే ఆలోచన రావడం మంచిదేనన్నారు. ప్రతిపక్షంలో ఐదు నెలలు కూడా ఉండలేకపోతున్న మీరు ప్రతిపక్షంలో ఉండాలో టీడీపీ, డీఎంకే, జేడీయూ, టీఎంసీ పార్టీల వద్ద నేర్చుకోవాలని హితవు పలికారు.

సీఎం కుటుంబ సభ్యులను టార్గెట్ చేస్తారా?:

సీఎం అమెరికా పర్యటనకు వెళ్తే మీ పైశాచిక ఆనందం ఏంటో అర్థం కావడం లేదని మండిపడ్డారు. సీఎం కుటుంబ సభ్యుల ప్రైవేట్ టూర్ ను సైతం బీఆర్ఎస్ సోషల్ మీడియా సైన్యంతో టార్గెట్ చేస్తున్నారని దుయ్యబట్టారు. గతంలో కేటీఆర్ అమెరికా వెళ్లినప్పుడు ఆయన వెంట ఎంత మంది వెళ్లారో ఫోటోలు లేవా అని ప్రశ్నించారు. ఇక్కడ రాజీనామా చేస్తానని చెప్పిన నాయకుడు నిన్న బాలి బీచ్ లో తిరుగుతున్నాడని ఆయన ఫోటోలు మేము ప్రచారం చేస్తున్నామా? ఎవరి ప్రైవేట్ లైఫ్ వారికి ఉంటుందన్నారు. రాజకీయం చేసినంత మాత్రాన ఎవరి పెళ్లిలకు వెళ్లొద్దా అని ప్రశ్నించారు. సోషల్ మీడియాలో ట్రోల్స్ చేస్తూ తెలంగాణ సమాజాన్ని తప్పుదోవ పట్టిస్తున్నారని దుయ్యబట్టారు. 2025 ఆగస్టు 15 వరకు మా ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలను కేవలం ప్రతిపక్ష హోదాలో గమనించాలన్నారు. గొప్ప పనులు చేసి ఉంటే కేసీఆర్ ను ప్రజలు ఎందుకు ప్రతిపక్షంలో కూర్చొండబెట్టేవారని ప్రశ్నించారు.

Advertisement

Next Story

Most Viewed