నర్సింగ్ డైరెక్టరేట్ ఎక్కడ.. ఇద్దరు మంత్రుల హామీ ఇచ్చినా నెరవేరలేదు!

by Anjali |
నర్సింగ్ డైరెక్టరేట్ ఎక్కడ.. ఇద్దరు మంత్రుల హామీ ఇచ్చినా నెరవేరలేదు!
X

దిశ, తెలంగాణ బ్యూరో: ‘‘నర్సులకు ప్రత్యేకంగా ఓ డైరెక్టరేట్ ను ఏర్పాటు చేస్తాం’’.. అని మొదటి విడత సర్కార్​లో అప్పటి హెల్త్ మినిస్టర్​లక్ష్మారెడ్డి అసెంబ్లీ సాక్షిగా హామీ ఇచ్చారు. ఇది ఎంతకీ నెరవేరకపో‘‘నర్సులకు ప్రత్యేకంగా ఓ డైరెక్టరేట్ ను ఏర్పాటు చేస్తాండంతో హరీశ్​రావు హెల్త్ పోర్ట్ పోలియో స్వీకరించిన తర్వాత కూడా రిక్వెస్ట్ చేశారు. ‘‘ నర్సింగ్ డైరెక్టరేట్ తప్పకుండా ఏర్పాటు చేస్తాం..’’ అని ఆయన కూడా హామీ ఇచ్చారు. అయినా.. ఇప్పటికీ అందుబాటులోకి రాలేదు.

సర్కారు కేవలం నర్సింగ్ డే సంబురాలు నిర్వహిస్తుందే తప్ప.. తమకు న్యాయం చేయడం లేదని, సమస్యలకు పరిష్కారం చూపడంలేదని నర్సులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వైద్యాధికారులు కూడా చిన్నచూపు చూస్తున్నారని వాపోతున్నారు. రాష్ట్ర ఆరోగ్య రంగానికి గుండెకాయ లాంటి నర్సింగ్ వ్యవస్థను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శిస్తున్నారు. డాక్టర్​తర్వాత పేషెంట్లకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు కృషి చేస్తున్న తమను గుర్తించాలని నర్సింగ్ అసోసియేషన్లు డిమాండ్ చేస్తున్నాయి.

జీవో 317 కింది వెళ్లిపోగా..

2016లో సుప్రీంకోర్టు స్టాఫ్ నర్స్ నుంచి నర్సింగ్ ఆఫీసర్ గా అన్నిరాష్ట్రాల్లో హోదాను మార్చాలని తీర్పు ఇచ్చినది తెలిసందే. దీని అమలుకు రాష్ట్ర ప్రభుత్వం, ఉన్నతాధికారులు పట్టించుకోకుండా కాలయాపన చేస్తున్నారు. మెడికల్ రిక్రూట్ మెంట్ బోర్డులో నర్సింగ్ సెక్షన్​కు సంబంధించిన అధికారులెవరూ లేరు. జీవో నెం 317 కింద హైదరాబాద్​లోని స్టాఫ్ కు వేర్వేరు జిల్లాల్లో పోస్టింగ్ లు ఇచ్చారు. దీంతో ఉద్యోగ ఖాళీలు ఏర్పడి హైదరాబాద్​ఆస్పత్రుల్లో పనిచేసే నర్సులపై తీవ్ర ఒత్తిడి పెరిగింది. దీంతో కొరతతో సమస్య ఎదుర్కొంటుండగా పరిష్కరించేందుకు సర్కార్​ఆలోచన చేయడం లేదు.

ప్రైవేట్ రంగంలో నర్సులకు రూ.26 వేలు కనీస వేతనంగా ఇవ్వాలని సుప్రీంకోర్టు తీర్పుపైన కూడా ఆఫీసర్లు ఫోకస్​పెట్టడం లేదు. ప్రైవేట్ నర్సింగ్ విద్యాసంస్థల్లో చదువుకునే స్టూడెంట్స్ కి స్కాలర్ షిప్ లు విడుదల కావడంలేదు. శాశ్వత నర్సింగ్ ఉద్యోగాల భర్తీలోనూ ప్రభుత్వ కాంట్రాక్టు పద్ధతిలో విధుల్లో ఉన్నవాళ్లకు, ప్రైవేట్ రంగంలోని వారికి , నర్సింగ్ కోర్సును పూర్తి చేసినవాళ్లకు సీనియారిటీని మేరకు గతంలో ఏడాదికి 1 మార్కు వెయిటేజ్​కింద ఇచ్చేది. 2022 నోటిఫికేషన్ లో వెయిటేజ్ మార్కులు కూడా రద్దు చేశారు. దీంతో రాష్ట్రంలో దాదాపు 35 వేల మంది నిరుద్యోగ నర్సింగ్ అభ్యర్థులకు అన్యాయం జరిగింది.

తీవ్ర అన్యాయం: గోవర్ధన్​నర్సింగ్ సమితి అధ్యక్షుడు

కేసీఆర్​పాలనలో నర్సులకు తీవ్ర అన్యాయం జరుగుతుంది. విధుల్లోనూ వివక్షనే. ఇటీవల భర్తీ చేసిన మిడ్​లెవల్​హెల్త్​ప్రొవైడర్​పోస్టుల్లోనూ నర్సులను పూర్తిగా అణగదొక్కే ప్రయత్నం చేశారు. ఆయుష్మాన్​భారత్ కింద పోస్టులకు నర్సింగ్ అభ్యర్థులను నియమించాలి. కానీ.. స్టాఫ్​నర్సులకు అవకాశం ఇచ్చారు. నర్సింగ్ కమిషన్​ఎన్నికలు జరగడం లేదు. దీంతో డైరెక్టరేట్ సాధ్యం కావడం లేదు. 2014 నుంచి ఇప్పటివరకు ఒకరే నర్సింగ్ కౌన్సిల్​ కు రిజిస్ట్రార్ గా ఉండగా.. ఇతరులకు అవకాశమే రావడం లేదు.

Advertisement

Next Story

Most Viewed