- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
`బండి´ మొబైల్ ఫోన్ ఎక్కడ?.. నెల దాటినా దర్యాప్తులో లేని పురోగతి
దిశ తెలంగాణ క్రైం బ్యూరో: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మొబైల్ ఫోన్ ఎక్కడ?. తన సెల్ ఫోన్ కనిపించకుండా పోయిందంటూ ఆయన ఫిర్యాదు చేసి నెల దాటినా పోలీసులు ఇప్పటికీ దానిని రికవరీ చెయ్యలేకపోయారు. గమనించాల్సిన అంశం ఏమిటంటే 10వ తరగతి ప్రశ్న పత్రాల లీకేజీ కేసులో ఆ ఫోనే కీలకం అని స్వయంగా పోలీస్ అధికారులే చెప్పటం, మరోవైపు బండి సంజయ్ తన సెల్ ఫోన్ సీఎం కేసీఆర్ వద్ద ఉందంటూ ఇప్పటికే ఆరోపణలు చేయటం, ఏప్రిల్‌లో జరిగిన పదో తరగతి పరీక్షల సమయంలో వరంగల్ జిల్లా కమలాపూర్ జెడ్పీహెచ్ స్కూల్ నుంచి హిందీ ప్రశ్న పత్రం లీక్ అయిన విషయం తెలిసిందే. ఓవైపు పరీక్ష జరుగుతుండగానే ఇది వాట్సాప్ గ్రూపుల్లో చక్కర్లు కొట్టింది. ఈ వ్యవహారంలో పోలీసులు బండి సంజయ్ మీద కూడా కేసులు నమోదు చేసారు. ఏప్రిల్ 5వ తేదీన బండి సంజయ్ ని కరీంనగర్‌లో అరెస్ట్ చేసి హైదరాబాద్ శివార్లలోని బొమ్మలరామారం పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఆ తర్వాత వరంగల్ పోలీసులకు అప్పగించారు.
అయితే, బొమ్మలరామారం పోలీస్ స్టేషన్‌కు తీసుకువెళ్లిన సమయంలో తన ఫోన్ కనిపించకుండా పోయిందని బండి సంజయ్ కరీంనగర్ టూ టౌన్ పోలీస్ స్టేషన్‌లో ఏప్రిల్ 10న ఫిర్యాదు చేశారు. తన ఫోన్ పోలీసుల వద్దనే ఉందని మీడియాతో కూడా చెప్పారు. పోలీసుల నుంచి దానిని సీఎం కేసీఆర్ తీసుకున్నారని ఆరోపణలు చేసారు. మరోవైపు పోలీసులు బండి సంజయ్ ఫోన్ తమ వద్ద లేదని ప్రకటించారు. కేసులో అది కీలక ఆధారమని చెబుతూ పరోక్షంగా ఫోన్ బండి సంజయ్ వద్దనే ఉన్నట్టు చెప్పారు. ఇటువంటి పరిస్థితుల్లో అసలు మొబైల్ ఫోన్ ఎక్కడుందన్నది కనుగొనాల్సిన బాధ్యత పోలీసుల మీద ఉంది. అయితే, బండి సంజయ్ ఇచ్చిన ఫిర్యాదుపై కేసులు నమోదు చేశారు తప్పితే ఇప్పటి వరకు పోలీసులు దర్యాప్తులో ఒక్క అడుగు కూడా ముందుకు వెయ్యలేక పోయారు. దీనిపై బీజేపీ శ్రేణులు విమర్శలు గుప్పిస్తున్నారు. సందర్భం వచ్చిన ప్రతీసారీ మంత్రులు దేశంలోనే మన పోలీస్ నెంబర్ వన్ అని చెబుతుంటారని... ఇదేనా నెంబర్ వన్ అంటే అని ప్రశ్నిస్తున్నారు.
Read More: తెలంగాణ బీజేపీపై ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు