- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Gajwel MLA : మా ఎమ్మెల్యే ఎక్కడ? కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు
దిశ, డైనమిక్ బ్యూరో: మా ఎమ్మెల్యే కనబడుట లేదు.. ఆచూకీ కనుగొనండని నియోజకవర్గ ప్రజల తరపున పోలీసులకు ఫిర్యాదు చేశారు. మాజీ సీఎం, ప్రతిపక్ష నాయకుడు, గజ్వేల్ ఎమ్మెల్యే కేసీఆర్ కనిపించడం లేదని ఆదివారం గజ్వేల్ పోలీసులకు కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి బండారి శ్రీకాంత్ రావు ఫిర్యాదు చేశారు. కేసీఆర్ కు గజ్వేల్ ప్రజలు ఓట్లు వేసి ఎమ్మెల్యేగా గెలిపిస్తే కనుచూపు మేరలో కూడా కనిపించడం లేదని ఫిర్యాదులో పేర్కొన్నారు. మా ప్రజలు మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిపించి.. ప్రతిపక్ష నాయకుని హోదా కల్పించారని తెలిపారు. గత 10 నెలల నుంచి మా ఎమ్మెల్యే కల్వకుట్ల చంద్ర శేఖర్‌రావు ఎక్కడ ఉన్నది, మా ప్రజల బాదలు చెబుదామంటే వారిని కలవడానికి ఎక్కడో ఎక్కడో వెతికాము, కానీ వారి జాడ మాత్రం మాకు తెలియడం లేదని ఫిర్యాదులో పేర్కొన్నారు.
తమ గజ్వేల్ ప్రాంత ప్రజలు కేసీఆర్‌పైన గంపేడు ఆశతో గెలిపించుకొంటే ఇక్కడి ప్రజా సమస్యలు విస్మరించారని విమర్శించారు. ఇక్కడి ప్రజలు మీ రాకకై ఎదురు చూస్తూ చాలా ఆందోళన చెందుతున్నారని వెల్లడించారు. మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్ భూ నిర్వాసితులకు ఇచ్చిన హామీలు నెరవేరక ఎక్కడి సమస్యలు అక్కడే మిగిలిపోయాయని వివరించారు. ప్రాంత సమస్యలు శాసనసభలోనైనా ప్రశ్నిస్తారని అనుకుంటే శాసన సభకు కూడా ముఖం చాటేసి తప్పించుకున్నారని తెలిపారు. కావున గజ్వేల్ ఎమ్మెల్యేను వెతికి పెట్టి నియోజకవర్గంలోని సమస్యలను పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని గజ్వేల్ పోలీసులను కోరారు.