- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
స్టార్ క్యాంపెయినర్లు ఎక్కడ? కాంగ్రెస్‌లో కొత్త టెన్షన్!
దిశ, తెలంగాణ బ్యూరో: ఎన్నికలకు మరో 19 రోజుల సమయం మాత్రమే ఉన్నది. కాంగ్రెస్ పార్టీ స్టార్ క్యాంపెయినర్లు సభలు, ప్రచారాల్లో కానరావడం లేదు. ప్రచారానికి నూతన క్యాపెంయినర్ల లిస్టును ఇప్పటి వరకు రిలీజ్ చేయలేదు. గతంలో స్టార్ క్యాంపెయినర్‌గా పనిచేసిన కోమటిరెడ్డి ఎన్నికల ప్రచారంలో తిరగడం లేదు. ఆయనతో పాటు రాష్ట్రంలోని పలువురు కీలక నేతలు నియోజకవర్గాలకే పరిమితం అవుతున్నారు.
సీఎం సీటు కోసం పోటీ పడుతున్నారే తప్పా.. పార్టీని అధికారంలోకి తేవడానికి కృషి చేయడం లేదని సెకండ్ కేడర్ విమర్శలు కురిపిస్తున్నది. సీఎం సీటుకు అర్హతను కలిగి ఉన్నామని, నియోజకవర్గంలో గెలిపిస్తే రాష్ట్రానికి సారథులుగా మారుతామని ఇప్పటికే భట్టి విక్రమార్క, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, జగ్గారెడ్డి బహిరంగంగా చెప్పగా.. తామేమీ తక్కువ కాదనేది ఎంపీ ఉత్తమ్, మాజీ మంత్రి జానారెడ్డి అనుచరుల వద్ద ప్రస్తావిస్తున్నారు. పార్టీని పవర్లోకి తీసుకురావాలని క్షేత్రస్థాయి కేడర్ కృషి చేస్తుంటే... అగ్ర నేతలంతా స్వప్రయోజనాల కోసమే ప్రయత్నించడం విచిత్రంగా ఉన్నదని గ్రౌండ్ కేడర్ అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు.
పీసీసీ ఏక్ నిరంజన్?
బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు. తామేమీ తక్కువ కాదని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సైతం ప్రచారాన్ని వేగవంతం చేశారు. ఆయన పోటీ చేస్తున్న రెండు సెగ్మెంట్లతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా కీలక నియోజకవర్గాలన్నింటిలోనూ ప్రచారం చేస్తున్నారు. కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాల్సిందిగా ప్రజలను అభ్యర్థిస్తున్నారు.
పీసీసీ చీఫ్ ఒక్కరే రాష్ట్రమంతటా తిరుగుతున్నా.. సీఎం సీటు కోసం ప్రయత్నిస్తున్న నేతలెవ్వరూ సొంత నియోజకవర్గాలు వదిలి బయటకు రావడం లేదు. పార్టీ గెలుపు కోసం పాటు పడకుండా.. సీఎం కూర్చీపైనే అగ్రనేతలు ఆశలు పెంచుకోవడం ఎంత వరకు కరెక్ట్ అని సొంత పార్టీ నేతలే ప్రశ్నిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రచారాన్ని రేవంత్ ఒక్కరే రాష్ట్రమంతటా చేయడం సవాల్‌గా మారిందని పార్టీ నేతలు వెల్లడిస్తున్నారు. అగ్రనేతలంతా కలిసి కట్టుగా పనిచేసి పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి కృషి చేయాలని నేతలు కోరుతున్నారు.