- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Harish Rao letter To Cm: ఉపాధ్యాయులకు పీఆర్సీ ఎప్పుడు?.. సీఎంకు హరీశ్ రావు బహిరంగ లేఖ
దిశ, డైనమిక్ బ్యూరో: ఉపాధ్యాయులకు పీఆర్సీ ఎప్పుడు ప్రకటిస్తారో స్పష్టత ఇవ్వాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు డిమాండ్ చేశారు. పదోన్నతి పొందిన ఉపాధ్యాయులతో శుక్రవారం సీఎం ముఖాముఖీ కార్యక్రమం నిర్వహిస్తున్న నేపథ్యంలో బీఆర్ఎస్ లెజిస్లేచర్ పార్లీ తరపున హరీశ్ రావు సీఎంకు బహిరంగ లేఖ రాశారు. పదోన్నతి పొందిన వేలాది మంది ఉద్యోగ ఉపాధ్యాయులతో మీరు ముఖాముఖి నిర్వహిస్తున్నందుకు ఈ సందర్భంగ మీకు అభినందనలు. 10,468 పండిత, పీఈటీ పోస్టుల అప్ గ్రేడేషన్ కు గత బీఆర్ఎస్ ప్రభుత్వమే అన్ని రకాల అనుమతులు ఇచ్చింది. మీరు ఇవాళ నిర్వహిస్తున్న సభలో సింహభాగం వారే కావడం గమనించాలని కోరారు. అలాగే భాషాపండింతులకు, పీఈటీ లకు అడ్డంకిగా ఉన్న సర్వీసురూల్స్ 11,12 ను మాచ్రి కొత్తగా 2,3, 9,10 జీవోలకు గత బీఆర్ఎస్ ప్రభుత్వమే అనుమతి ఇచ్చిందని కాళేశ్వరం జోన్ 1లో 1,050 గెజిటెడ్ ప్రధానోపాధ్యయ ప్రమోషన్లు మా హయాంలోనే ఇచ్చామన్నారు. ప్రాథమిక పాఠశాలలకు మా ప్రభుత్వం 10 వేల ప్రధానోపాధ్యాయ పోస్టులను మంజూరు చేస్తే ఇప్పటి వరకు పాఠశాలలకు కేటాయించలేదని వెంటనే కేటాయించిన ఎస్ జీటీలకు ప్రమోషన్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రస్తుత ఉపాధ్యాయుల పదోన్నతులకు, బదిలీలకు గత ప్రభుత్వం సెప్టెంబర్ లోనే లాంఛనాలు పూర్తి చేసిందని గుర్తు చేశారు. ఇవాళ్టి ముఖామిఖిలో ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలపై స్పష్టమైన విధానపరమైన నిర్ణయాలు వెలువరించి ఆదేశాలు ఇవ్వాలని బీఆర్ఎస్ పక్షాన్ని డిమాండ్ చేస్తున్నామన్నారు.
ఆ స్కీమ్ ను కొనసాగించాలి:
కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ ప్రకారం కనీసం పెండింగ్ లో ఉన్న 4 డీఏలను ఎప్పుడు అనుమతి ఇస్తారు?, న్యూ పెన్షన్ స్కీమ్ స్థానంలో ఓల్డ్ పెన్షన్ స్కీమ్ ఎప్పుడు అమలు చేస్తారు? సర్వాశిక్షా అభియాన్ ఉద్యోగుల సమస్యల పరిష్కారం? పాఠశాలలకు స్కావెంజర్స్ కు అనుమతి?స్కూళ్లకు ఉచిత విద్యుత్ సమస్యలు ఎప్పటి వరకు పరిష్కరిస్తారో చెప్పాలన్నారు. బదిలీ అయినా ఇప్పటికీ నూతన పాఠశాలల్లో చేరని ఎస్జీటీలను వెంటనే రిలీవ్ చేయాలని బదిలీల వలన ఏర్పడిన ఖాళీల మేరకు అవసరమైన చోట విద్యా వాలంటీర్లను నియమించాలని డిమాండ్ చేశారు. మిడ్ డే మీల్స్ పెండింగ్ బకాయిలు వెంటనే చల్లించి ఆ కార్మికులకు మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు వెంటనే వేతనాలు పెంచాలన్నారు. పాఠశాల విద్యార్థులకు అల్ఫాహారం అందించే మంచి పథకాన్ని బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రారంభించిందని విద్యార్థుల ప్రయోజనాల రీత్యా ఈ పథకాన్ని కాంగ్రెస్ ప్రభుత్వ కొనసాగించాలని డిమాండ్ చేశారు.