- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
NOTA: నోటాకు అందరికంటే ఎక్కువ ఓట్లు వస్తే పరిస్థితేంటీ.. అప్పుడు ఎవరిని విజేతగా ప్రకటిస్తారు..?
దిశ,వెబ్ డెస్క్: తెలంగాణ వ్యాప్తంగా ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. ఈ ఓటింగ్ రిజల్ట్స్ డిసెంబర్ 3 న వెలువడనున్నాయి. ఈ నేపథ్యంలో.. నోటాకు సంబంధించిన ఓటర్లలో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రాజకీయ పార్టీలు నిలబెట్టిన అభ్యర్థులతో పాటు స్వతంత్ర అభ్యర్థులు ఎవ్వరూ నచ్చని సందర్భంలో.. నోటాకి ఓటు వేస్తారు. అయితే.. పోలింగ్‌లో అభ్యర్థుల కంటే నోటాకు ఎక్కువ ఓట్లు వస్తే.. పరిస్థితేంటీ.. అప్పుడు ఎవరిని విజేతగా ప్రకటిస్తారన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. దాని గురించి ఇక్కడ వివరంగా తెలుసుకుందాం..
అభ్యర్థులందరి కంటే నోటాకే ఎక్కువ ఓట్లు రావడం చాలా సార్లు జరిగింది. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ పార్టీలు మినహా వేరే పార్టీల అభ్యర్థుల ఓట్ల కంటే నోటాకే ఎక్కు ఓట్లు రావటం గమనార్హం. ఇటీవల జరిగిన గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో 5.5 లక్షలకు పైగా ఓటర్లు నోటాకు ఓటేశారు. 2018లో దేశం వ్యాప్తంగా మొదటిసారి నోటాకు కూడా అభ్యర్థులతో సమాన హోదాను ఇచ్చారు. 2018 డిసెంబర్‌లో హర్యానాలోని ఐదు జిల్లాల్లో జరిగిన మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలల్లో నోటాకు ఎక్కువ ఓట్లు రాగా.. అభ్యర్థులందరినీ అనర్హులుగా ప్రకటించారు. అనంతరం మరోసారి మళ్లీ ఎన్నికలు నిర్వహించాలని ఎన్నికల సంఘం నిర్ణయించింది. మళ్లీ ఎన్నికల్లో నోటాకు అధిక ఓట్లు రాగా.. రెండో స్థానంలో నిలిచిన అభ్యర్థిని విజేతగా ప్రకటించారు. మరోవైపు.. నోటాకు అభ్యర్థికి సమాన సంఖ్యలో ఓట్లు వచ్చిన సందర్భాల్లో.. అటువంటి పరిస్థితిలో అభ్యర్థి విజేతగా ప్రకటిస్తారు.