‘పదేండ్లు అధికారంలో ఉండి BRS ఏం చేసింది’

by Rajesh |
‘పదేండ్లు అధికారంలో ఉండి BRS ఏం చేసింది’
X

దిశ, వెబ్‌డెస్క్: ఉద్యోగాల విషయంలో పదేండ్లు అధికారంలో ఉండి ఏం చేశారని బీఆర్ఎస్‌పై కాంగ్రెస్ నేత మానవతా రాయ్ ఫైర్ అయ్యారు. గ్రూప్ 2, గ్రూప్ 3 ఉద్యోగాల సంఖ్యను పెంచాలి అని నిరుద్యోగులు అడుగుతున్నారని తెలిపారు. నిరుద్యోగుల సమస్యను బీఆర్ఎస్ మీదేసుకున్నట్లు మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. రుణమాఫీ చేస్తే రాజీనామా చేస్తా అన్న హరీష్ రావు.. రాజీనామా చేయకుండా నిరుద్యోగులను ముందేసుకున్నారని సెటైర్లు వేశారు. మోతిలాల్‌ను రెచ్చగొట్టి గులాబీ లీడర్లు రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ సర్కార్‌లో పోరాటాలు వుండవు.. చర్చలతో సాల్వ్ అవుతాయని తెలిపారు. గుంటనక్కలా వున్న బీఆర్ఎస్ నేతలు ఖబర్దార్ అని హెచ్చరించారు.

ఇవాళ సీఎం సాయంత్రం నిరుద్యోగుల సమస్యలపై నిర్ణయం తీసుకుంటారని తెలిపారు. ప్రజా ప్రభుత్వంలో కోర్టు కేసులను పరిష్కరించి మూడు నెలల్లో 30 వేల ఉద్యోగాలు భర్తీ చేశామన్నారు. పదేండ్లలో ఒక్క గ్రూప్ -1 భర్తీ చేయలేకపోయిందని బీఆర్ఎస్‌పై మండిపడ్డారు. పేపర్ లీక్‌లతో నిరుద్యోగులను ఆగం చేశారని గత ప్రభుత్వం ఆయన సీరియస్ అయ్యారు. టీచర్ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నామని తెలిపారు. ఏకోపాద్యాయ పాఠశాలలను నడుపుతాం అని సీఎం స్పష్టం చేశారని గుర్తు చేశారు. అలాంటిది నిరుద్యోగులకు రేవంత్ సర్కార్ అన్యాయం చేస్తుందా అని ప్రశ్నించారు. నిరుద్యోగులు ధైర్యంగా ఉండాలని పిలుపునిచ్చారు.

Advertisement

Next Story

Most Viewed