- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
Tummala Nageshwar Rao : తుమ్మల అడుగులు ఎటు వైపు..!? ఉత్కంఠ రేపుతోన్న సమ్మేళనాలు
ఖమ్మం జిల్లా రాజకీయాల్లో ఆయనది ఒక చరిత్ర. దాదాపు మూడు పర్యాయాలు మంత్రిగా చేసిన అపార అనుభవం కలిగిన మాజీ మంత్రి తుమ్మల అడుగులు ఎటు..!? అనే దానిపైనే జిల్లా ప్రజలు ఆసక్తిగా చర్చించుకుంటున్నారు. పాలేరు నుంచి చర్ల వరకు జరిగిన అభివృద్ధిలో ఈయన పాత్ర కీలకం. తెలంగాణ ఆవిర్భావం తర్వాత కేసీఆర్ ఆహ్వానం మేరకు బీఆర్ఎస్ లో చేరిన తుమ్మల మంత్రిగా తనదైన ముద్ర వేశారు. 2018లో కందాళ ఉపేందర్‌రెడ్డి చేతిలో ఓటమి పాలవ్వడంతో కొంతకాలంగా సైలెంట్ అయ్యారు. కానీ అభిమానుల కోరిక మేరకు ఇటీవల వరుస పర్యటనలు చేస్తున్నారు. ఇదే క్రమంలో రూరల్ మండలంలోని తన క్యాంప్‌కార్యాలయంలో దాదాపు 50వేల మందికి భోజనాలు ఏర్పాటు చేయడం, ఆత్మీయ సమ్మేళనం నిర్వహించడం చర్చనీయాంశంగా మారింది. ఈ ఆత్మీయ సమ్మేళనం సాక్షిగా తుమ్మల పార్టీ మారుతారా..? లేక తన బలం చూపించేందుకోసమే ఈ సమ్మేళనం నిర్వహిస్తున్నారా అనే విషయం తెలియాల్సి ఉంది.
దిశ, ఖమ్మం రూరల్: జిల్లా రాజకీయాల్లో ఆయనది ఒక చరిత్ర. దాదాపు మూడు పర్యాయాలు మంత్రిగా చేసిన అపార అనుభవం కలిగిన మాజీ మంత్రి తుమ్మల అడుగులు ఎటు..!? అనే దానిపైనే జిల్లా ప్రజలు ఆసక్తిగా చర్చించుకుంటున్నారు. పాలేరు నుంచి చర్ల వరకు జరిగిన అభివృద్ధిలో ఈయన పాత్ర కీలకం. తెలంగాణ అవిర్భావించడం, సీఎం కేసీఆర్ మాజీ మంత్రి తుమ్మలను ఆహ్వానించి మంత్రిగా ఇవ్వడం ఇవన్ని చకచకగా జరిగాయి. అనంతరం పాలేరుపై దృష్టి సారించిన తుమ్మల ఉప ఎన్నికల్లో విజయం సాధించారు. 2018 జనరల్ ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన కందాల ఉపేందర్‌రెడ్డిపై ఓటమిపాలయ్యారు. అనంతరం ఎమ్మెల్యే కందాల టీఆర్ఎస్తీర్థం పుచ్చుకోవడంతో నియోజకవర్గంలో కందాల–తుమ్మల వర్గాలు విడిపోయారు.
కొంతకాలం సైలెంట్ ఉన్న తుమ్మల అనంతరం అభిమానుల కోరిక మేరకు జిల్లా వ్యాప్తంగా పర్యటనలు చేస్తున్నారు. కానీ సీఎం కేసీఆర్ మాత్రం సిట్టింగ్‌లకే సీట్లు అనే ప్రకటించడంతో టీఆర్ఎస్‌లో చేరిన కందాలకు టికెట్ కన్ఫాం అయిందని తన వర్గీయలు చెబుతున్నారు. ఈ క్రమంలో రాజకీయ ఉద్దండుడైన తుమ్మల తన అనుభావానికి పదును పెట్టినట్లు తెలుస్తున్నది. వాజేడులో టీడీపీ నిర్వహించిన ఆత్మీమ సమ్మళనానికి హాజరుకావడంతో పాటు సత్తుపల్లిలో టీడీపీ ఆద్వర్యంలో నిర్వహించిన టీడీపీ సభకు సైతం తుమ్మల వెళ్లి ప్రసంగించడంపై జిల్లా వ్యాప్తంగా చర్చానీయంశంగా మారింది. అనంతరం జిల్లాకు చంద్రబాబు రావడం ఈసభకు భారీ స్థాయిలో టీడీపీ శ్రేణులు తరలిరావడం వెనుకు తుమ్మల పాత్ర ఉందని జిల్లాకు చెందిన పలువురు సీనియర్బీఆర్ఎస్ నాయకులు సీఎం కేసీఆర్‌కు ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. పార్టీ సీటు ఇచ్చిన ఇవ్వకపోయిన ప్రజాక్షేత్రంలో తాడోపెడో తేల్చుకోవాల్సిందేనని తన వర్గీయులు చెబుతున్న మాట.
ఆయనకూ తప్పని సమ్మేళనం
జిల్లా రాజకీయాల్లో తుమ్మలకు ప్రత్యేక స్థానం ఉందనే చెప్పాలి. ప్రతి ఏడాది నూతన సంవత్సరం రోజున స్వగ్రామామైన గండుగులపల్లిలో మాత్రమే అనుచురులను, పార్టీ నాయకులను కలిసేవారు. మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో రూరల్ మండలంలోని శ్రీసిటిలో నిర్మించిన తన క్యాంప్ కార్యాలయంలో దాదాపు 50వేల మందికి భోజనాలు ఏర్పాటు చేయడం, ఆత్మీయ సమ్మేళనం నిర్వహించడంపై జిల్లా ప్రజలు పలు రకాలుగా చర్చించుకుంటున్నారు. ఈఆత్మీయ సమ్మేళనం సాక్షిగా తుమ్మల పార్టీ మారుతారా..? లేక తన బలం చూపించేందుకోసమే ఈ సమ్మేళనమా అనేది తెలియాల్సి ఉంది. బీఆర్ఎస్ నుంచి టికెట్రాకపోయిన బరిలో నిలిచే కార్యక్రమంలో భాగమే ఈ సమ్మేళనం అని తుమ్మల వర్గీయులు చెబుతున్న మాట. ఏదిఏమైనా సమ్మేళనం ఎటు దారితీస్తుందో.. ఎవరి చరిత్ర మారుస్తుందో వేచి చూడలి మరి.