- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
హిందూ దేవతలను దూషించే వారిపై చర్యలేవి? : Vijaya Shanthi
దిశ, డైనమిక్ బ్యూరో : తమ మతాన్ని ప్రేమిస్తూ, పరమతస్తుల్ని ద్వేషించేవారు చాలామందే కనిపిస్తుంటారు కానీ, తెలంగాణ సీఎం కేసీఆర్ ఇందుకు భిన్నం అంటూ బీజేపీ నేత విజయశాంతి ఆరోపించారు. గొప్ప హిందువుగా చెప్పుకునే ఆయన, ఆ హిందూ మతాన్నే కించపరుస్తూ, దూషిస్తూ, ద్వేషిస్తూ... అన్య మతాల్ని మాత్రం అమితంగా ప్రేమిస్తుంటాడని సెటైర్లు వేశారు. హిందువుల గురించి బహిరంగ సభల్లో హిందుగాళ్లు.. బొందుగాళ్లు అన్న ఈ పెద్ద మనిషి ఇతర మతాలవారు హిందువుల పట్ల ఎంత ఘోరమైన అవమానాలకు పాల్పడినా పట్టించుకోడని ఆగ్రహం వ్యక్తం చేశారు. హైందవ మత విశ్వాసాలను పాటించే హిందువులు, కేవలం బీజేపీ వారిని ఉద్దేశించి మతపిచ్చి అంటూ పరిహాసం చేయడం కేసీఆర్‌కు బాగా అలవాటైందని విజయశాంతి మండిపడ్డారు.
ఆయన చేతికి ఎప్పుడూ కనిపించే దర్గా దట్టీ చూసి ఆయనకు కూడా మత పిచ్చి ఉందని అనొచ్చు.. కానీ, ఏనాడూ ఆయన్ని ఉద్దేశించి అలా అనలేదని అన్నారు. మరి బీజేపీని మాత్రం మత పిచ్చి అంటూ వ్యాఖ్యలు చేయడం సరైనదేనా? హిందూ దేవీదేవతల్ని కించపరచిన మునావర్ షోకి హైదరాబాదులో అనుమతి ఇవ్వడం ఏ రకంగా కరెక్టో చెప్పాలని డిమాండ్ చేశారు. పోలీసులు 15 నిమిషాలు కళ్లు మూసుకుంటే హిందూ, ముస్లిం జనాభాను సమానం చేస్తానని హిందువుల్ని హెచ్చరించిన టీఆర్ఎస్ సయామీ కవల పార్టీ ఎంఐఎం నేతపై కోర్టు కేసు విషయంలో ఎందుకని అప్పీలుకు వెళ్లలేదో కేసీఆర్ జవాబివ్వాలని అన్నారు.
ఇదే కాదు, ఎంఐఎం నేతలు హిందూ దేవుళ్లను దూషించిన వీడియోలన్నీ ఇప్పటికీ యూట్యూబ్‌లోను, సోషల్ మీడియాలోను చక్కర్లు కొడుతున్నాయని... అయినా, వాటిపై కేసీఆర్ ఎందుకు మౌనంగా ఉన్నారో చెప్పాలని ప్రశ్నించారు. ఉల్టా చోర్ కొత్వాల్‌కో డాంటే అన్నట్టుగా... కేసీఆర్, తనలోని మతపిచ్చిని ఇతరులకు అంటగడుతూ పబ్బం గడుపుకోవడమేగాక ప్రజల్ని తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నాడని . ఈ సర్కారు నాటకాల్ని ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. బుద్ధి చెప్పడానికి తగిన సమయం కోసం ఎదురు చూస్తూ ఉన్నారని విజయశాంతి మరోసారి కేసీఆర్‌పై విరుచుకుపడ్డారు.
తమ మతాన్ని మాత్రం ప్రేమిస్తూ, పరమతస్తుల్ని ద్వేషించేవారు చాలామందే కనిపిస్తుంటారు. కానీ, తెలంగాణ సీఎం కేసిఆర్ ఇందుకు భిన్నం. గొప్ప హిందువుగా చెప్పుకునే ఆయన... ఆ హిందూ మతాన్నే కించపరుస్తూ, దూషిస్తూ, ద్వేషిస్తూ...
— VIJAYASHANTHI (@vijayashanthi_m) August 26, 2022