- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కాసేపట్లో తెలంగాణకు మోడీ.. మంత్రి KTR సంచలన ట్వీట్
దిశ, వెబ్‌డెస్క్: ప్రధాని మోడీ మంగళవారం నిజామాబాద్ జిల్లాలో పర్యటించనున్న విషయం తెలిసిందే. రూ.8వేల కోట్ల అభివృద్ధి పనులకు మోడీ ప్రారంభోత్సవాలు, శంకుస్థాపన చేయనున్నారు. ఇక, ప్రధాని పర్యటన వేళ ట్విట్టర్ వేదికగా మోడీపై మంత్రి కేటీఆర్ ఫైర్ అయ్యారు.
‘ప్రధాని గారు మా మూడు హమీల సంగతేంటి? కాజీపేట కోచ్ ఫ్యాక్టరీకి ప్రాణం పోసెదెప్పుడు? బయ్యారం ఉక్కు కర్మాగారం నిర్మించెదెప్పుడు? పాలమూరు ప్రాజెక్టుకు జాతీయ హోదా దక్కెదెప్పుడు? మూడు రోజుల వ్యవధిలో రెండోసారి వస్తున్నారు. మరి ఆ మూడు విభజన హక్కులకు దిక్కేది? పదేళ్ల నుంచి పాతరేసి.. ఎంతకలం ఈ అబద్ధాల జాతర? మీ మనసు కరిగేదెప్పుడు.. తెలంగాణ గోస తీరేదెప్పుడు? గుండెల్లో గుజరాత్ ను పెట్టుకుని తెలంగాణ గుండెల్లో గునపాలా? కోచ్ ఫ్యాక్టర, ఉక్కు కర్మాగారం ఊపిరి తీశారు.
లక్షల ఉద్యోగాలిచ్చే ఐటీఐఆర్ ను ఆగం చేశారు. పాలమూరు రంగారెడ్డికి జాతీయ హోదా హామీని తుంగలో తొక్కారు. దశాబ్దాల పాటు దగాపడ్డ పాలమూరుకు ద్రోహం చేసి వెళ్లిపోయారు. మీ పదేళ్ల పాలనలో 4 కోట్ల తెలంగాణ ప్రజలనే కాదు.. 140 కోట్ల భారతీయులను మోసం చేశారు. 2022 కల్లా రైతుల ఆదాయం డబుల్ అన్నారు. దేశంలో ప్రతి ఒక్కరికి సొంత ఇళ్లు అన్నారు. ఏటా రెండు కోట్ల ఉద్యోగాలిస్తాం అన్నారు. పెట్రోల్ ధరలు నియంత్రిస్తాం అన్నారు. మీ దోస్తుకు ఇచ్చిన హామీలు తప్ప.. దేశ ప్రజలకిచ్చిన ఒక్క మాటనుు నెరవేర్చరా..? మీ పసుపు బోర్డు ప్రకటన కూడా మహిళా రిజర్వేషన్ మాదిరిగానే ఉంది.. ఎన్నికల వేళ హంగామా ఇప్పుడు.. మరి అది అమలు అయ్యేది ఎప్పుడో.. ప్రధానిగా మీ పదేళ్ల పాలనలో అదానికి తప్ప.. ఆమ్ ఆద్మీకి దక్కిందేంటి! మా మూడు ప్రధాన హమీలు నెరవేర్చకపోతే.. వచ్చే ఎన్నికల్లో బీజేపీ గూడు చెదరడం పక్కా..! మళ్లీ వంద స్థానాల్లో డిపాజిట్లు గల్లంతవడం గ్యారెంటీ..!’ అంటూ ట్వీట్ చేశారు.