- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పెళ్ళిళ్ల సీజన్ వచ్చింది..తులం బంగారం తూచ్ తూచేనా ? : కేటీఆర్
దిశ, వెబ్ డెస్క్ : లక్షలాది లగ్గాలు జరిగే మ్యారేజ్ సీజన్ మళ్లా వచ్చిందని..ఈ సారి కూడా తులం బంగారం తూచ్ తూచేనా ? అని సీఎం రేవంత్ రెడ్డిని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ట్విటర్ వేదికగా ప్రశ్నించారు. శుభ ముహుర్తాలతో పెళ్లి సందడి మొదలైందని.. మరి మీ కల్యాణ మస్తు కానుక హామీ అమలుకు సుముహూర్తం దొరకట్లేదా ? అని నిలదీశారు. పదిగ్రాముల పసిడి ఆశజూపి ఆడబిడ్డల ఓట్లు వేయించుకున్నావని..ఆడిన మాట తప్పి పచ్చని పందిళ్ల సాక్షిగా పచ్చి దగా చేస్తున్నావని మండిపడ్డారు. కనకపు సింహాసనమున కూర్చున్నాక...కనకం హామీని మర్చిపోయావా? లంకె బిందెలు దొరకలేదన్న నైరాశ్యంతో నవ వధువులకు ఇవ్వాల్సిన పుత్తడిని ఎగ్గొట్టడం భావ్యమా..? అని ఎద్దేవా చేశారు.
పేదింటి పెండ్లి కూతుళ్లకు టన్నుల కొద్ది గోల్డ్ బాకీ పడ్డావని... ఒలంపిక్స్ లో మోసాల పోటీలు పెడితే నీకు గోల్డ్ మెడల్ గ్యారెంటీ..! అని సీఎం రేవంత్ పై కేటీఆర్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. గట్టి మేళాలు మోగుతున్నాయి ..వట్టి మాటలు ఇంకెన్నాళ్లు..గోల్డ్ షాపుల్లో స్టాక్ లేదా..? బంగారు గనుల్లో తవ్వకాలు ఆగిపోయినయా? అని, వాగ్దానం చేసి వంచించడం మంచిది కాదని..ఆడబిడ్డలు బాధపడితే అరిష్టమని, ఈ సీజన్‌లోనైనా తులం బంగారం పథకాన్ని ప్రారంభించండని డిమాండ్ చేశారు.