Weather Report: రాష్ట్ర వ్యాప్తంగా నేడు, రేపు భారీ వర్షాలు.. మరోసారి ఎల్లో అలర్ట్ జారీ

by Shiva |
Weather Report: రాష్ట్ర వ్యాప్తంగా నేడు, రేపు భారీ వర్షాలు.. మరోసారి ఎల్లో అలర్ట్ జారీ
X

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్ర వ్యాప్తంగా నేడు, రేపు భారీ వర్షాలు పడే అవకాశం ఉందని, ఈ నేపథ్యంలోనే ఎల్లో అలర్ట్ జారీ చేసిస్తున్నట్లు హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. ఈ మేరకు రానున్న మూడు రోజుల్లో ఉరుములు, ఈదురు గాలులతో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే చాన్స్ ఉంది. బుధవారం ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్‌, జగిత్యాల, సిరిసిల్ల, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం జిల్లాలకు వాతావరణ శాఖ అధికారులు ఇప్పటికే ఎల్లో అలెర్ట్ జారీ చేసింది. ఇక గురువారం హైదరాబాద్‌, రంగారెడ్డి, మేడ్చల్‌ మల్కాజ్‌గిరి, మెదక్‌, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో ఎల్లో అలెర్ట్ జారీ అయింది. ఈ క్రమంలో పలుచోట్ల పెద్ద ఎత్తున పిడుగులు పడే అవకాశం ఉండటంతో ప్రజలంతా ఇంట్లోనే ఉండాలని, అత్యవసరం అయితే తప్పా.. ఎవరూ బయటకు వెళ్లకూడదని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు.

Next Story

Most Viewed