- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
అవినీతిపరుల అంతు చూస్తాం! పరేడ్ గ్రౌండ్స్ సభలో ప్రధాని మోడీ
దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్ర అభివృద్ధికి బీఆర్ఎస్ ప్రభుత్వమే అతి పెద్ద అడ్డంకిగా ఉన్నదని ప్రధాని మోడీ ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రం అభివృద్ధి కోసం చర్యలు తీసుకుంటున్నా సకాలంలో స్పందించకపోవడంతో రాష్ట్రానికి, ప్రజలకు అభివృద్ధి ఫలాలు అందడంలేదన్నారు. కుటుంబ, అవినీతి పాలనతో రాష్ట్రానికి చేటు జరుగుతున్నదని అన్నారు.
అధికారాన్ని గుప్పిట్లో పెట్టుకుని కుటుంబంలోని పిడికెడు మందికి లాభం చేకూర్చేలా రాష్ట్ర ప్రభుత్వం ఆలోచిస్తున్నదన్నారు. అభివృద్ధికి ఈ కుటుంబ పాలన, అవినీతి అడ్డంకిగా మారిందన్నారు. ప్రజలు, యువత వారి భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని అవినీతికి వ్యతిరేకంగా పోరాడాలని పిలుపునిచ్చారు. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవం చేసిన స,దర్భంగా పెరేడ్ గ్రౌండ్స్ లో జరిగిన బహిరంగసభలో మోడీ పై వ్యాఖ్యలు చేశారు.
తెలంగాణ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చాలని కేంద్రం భావిస్తూ ఉంటే ప్రతీ డెవలప్‌మెంట్ పనిలో స్వార్థం కోసం కుటుంబ పాలన ఆలోచిస్తూ ఉన్నదని అన్నారు. అవినీతి డబ్బు ఈ కుటుంబానికే దక్కాలనుకుంటున్నదన్నారు. పేదలకు ఇస్తున్న ఢబ్బును కూడా వీరి అవినీతికి వాడుకోవాలనుకుంటున్నదన్నారు. ఇప్పుడు అవినీతిపై యుద్ధం ప్రకటించి పారదోలాలని మోడీ భావిస్తున్నారని, దీన్ని జీర్ణించుకోలేక ఇలాంటి అవినీతి పాలకులు కోర్టుకు వెళ్ళారని, అక్కడ వారికి షాక్ తగిలిందన్నారు.
కుటుంబ, అవినీతి పాలనకు జవాబు చెప్పాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. అవినీతికి వ్యతిరేకంగా పోరాడాల్సిన టైమ్ వచ్చేసిందన్నారు. ఈ రాష్ట్ర ప్రజలు దీనిపైన దృష్టి పెట్టి తేల్చేయాలన్నారు. అవినీతిపరులపై చట్టపరంగా యుద్దం మొదలు కావాలన్నారు. దీనికి ఈ అవినీతిపరులు భయపడుతున్నారని అన్నారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పుడే కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడిందని, తెలంగాణ రాష్ట్ర ప్రజల కలలను నెరవేర్చడానికి భారీ స్థాయిలో నిధులను కేటాయించామని ప్రధాని గుర్తుచేశారు. రానున్న రోజుల్లో మరింత మంచి రోజులు తెలంగాణకు రానున్నాయని, పేదలకు దక్కాల్సిన ఫలాలు కొద్దిమంది గుప్పిట్లోకి వెళ్ళకుండా ప్రత్యక్ష నగదు బదిలీ విధానాన్ని తీసుకొచ్చామని, కానీ దీన్ని కుటుంబ, అవినీతి పాలకులు జీర్ణించుకోలేకపోతున్నారని అన్నారు.
చివరకు పేదలకు అందే రేషన్ బియ్యం విషయంలోనూ స్వార్థం కోసం పాకులాడుతున్నారని పరోక్షంగా తెలంగాణ పాలకును ఉద్దేశించి మోడీ వ్యాఖ్యానించారు. అవినీతికి వ్యతేరేకంగా కేంద్ర ప్రభుత్వం మొదలుపెట్టిన యుద్ధంలో తెలంగాణ ప్రజలు కలిసి రావాలని, అవినీతిని అంతమొందించడానికి తగిన సహకారం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.అవినీతి, కుటుంబ పాలనకు చరమగీతం పాడి తెలంగాణ ప్రజల, పేదల స్వప్నాలు సాకారమయ్యేందుకు సాయమందించాలని ప్రజలను కోరారు.
భాయి, భతీజా వాదులంటూ బీఆర్ఎస్ పార్టీ నేతలపై మోడీ పరోక్ష విమర్శలు చేశారు. ప్రతీ అభివృద్ధి పనిలో వారి స్వార్థాన్ని, చూసుకుంటున్నారని ఆరోపించారు. తెలంగాణ ప్రజలు ఇలాంటి కుటుంబ, అవినీతి పాలకులతో బహు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. అన్ని పనుల్లోనూ కుటుంబ పాలనతో రాష్ట్ర అభివృద్ధి పనులకు ఆటంకం కలుగుతున్నదని, అన్ని వ్యవస్థలనూ ఈ కుటుంబమే నియంత్రణలో ఉంచుకోవాలని భావిస్తూ ఉన్నదన్నారు. అభివృద్ధి పనులైనా, పెట్టుబడులైనా ఈ కుటుంబ పాలకులు వారి స్వార్థానికి ప్రయారిటీ ఇస్తున్నారని అన్నారు. కుటుంబ, అవినీతి పాలన వేర్వేరు కాదని, ఈ రెండూ కలిసిపోయి ఉన్నాయన్నారు. అన్ని వ్యవస్థలనూ ఈ కుటుంబమే కంట్రోల్ చేయాలనుకుంటున్నదన్నారు.
Read more: