Minister Ponguleti : జర్నలిస్టుల సమస్యలు పరిష్కరిస్తాం : మంత్రి పొంగులేటి

by Y. Venkata Narasimha Reddy |   ( Updated:2025-01-02 09:51:21.0  )
Minister Ponguleti : జర్నలిస్టుల సమస్యలు పరిష్కరిస్తాం : మంత్రి పొంగులేటి
X

దిశ, వెబ్ డెస్క్ : జర్నలిస్టు(Journalists)ల సమస్యల పరిష్కారాని(Solving the Problems)కి తమ ప్రభుత్వం(State Government) చిత్తశుద్ధి(Commitment)తో కృషి చేస్తుందని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి(Ponguleti Srinivas Reddy) అన్నారు. గురువారం సచివాలయంలోని తన కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్ట్స్ యూనియన్ (TUWJ) 2025 మీడియా డైరీని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పొంగులేటి మాట్లాడుతూ జర్నలిస్టులకు సంబంధించిన ఇండ్లు, హెల్త్ కార్డులు, అక్రిడియేషన్ కార్డుల సమస్యలను పరిష్కరిస్తామన్నారు. ప్రభుత్వం జర్నలిస్టుల సంక్షేమానికి కట్టుబడి ఉందన్నారు.

ఈ కార్యక్రమంలో సమాచార పౌర సంబంధాల శాఖ కమిషనర్ శ్రీ ఎస్. హరీష్, దేవులపల్లి అమర్, ఐజేయు మాజీ అధ్యక్షులు, కే.విరాహత్ అలీ, టీయుడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షులు, కె.రాంనారాయణ, టీయుడబ్ల్యూజే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, వై. నరేందర్ రెడ్డి, జాతీయ కార్యదర్శి, ఐజేయు, కె. సత్యనారాయణ, జాతీయ కార్యవర్గ సభ్యులు, ఐజేయు, కల్కూరి రాములు, ఉప ప్రధాన కార్యదర్శి, టీయుడబ్ల్యూజే, కె. శ్రీకాంత్ రెడ్డి, కార్యదర్శి, టీయుడబ్ల్యూజే, యం. వెంకట్ రెడ్డి, కోశాధికారి, టీయుడబ్ల్యూజే, ఏ. రాజేష్, బి. కిరణ్, గౌస్ మోహియుద్దీన్, అనీల్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, టీయుడబ్ల్యూజే, హెచ్.యూ.జే. అధ్యక్షులు, కార్యదర్శులు శిగా శంకర్ గౌడ్, హమీద్ షౌకత్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed