క్వాలిటీ చెక్ తరువాతే.. కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లిస్తాం : మంత్రి తుమ్మల కీలక వ్యాఖ్యలు

by Shiva |
క్వాలిటీ చెక్ తరువాతే.. కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లిస్తాం : మంత్రి తుమ్మల కీలక వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అభివృద్ధి పనులపై ప్రస్తుతం అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ సర్కార్ ఫోకస్ పెట్టింది. ఇప్పటికే పలు జిల్లాల్లో అభివృద్ధి పనులు చేపట్టిన కాంట్రాక్టర్లు తమ బిల్లులు చెల్లించాలంటూ అధికారుల చుట్టు ప్రదక్షిణలు చేస్తున్నారు. అదేవిధంగా మంత్రులకు కలిసి వినతిపత్రాలు కూడా అందజేస్తున్నారు. ఈ క్రమంలో తెలంగాణ మంత్రిగా బాధ్యతలు స్వీకరించి తొలిసారి ఖమ్మం కార్పొరేషన్ అధికారులతో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వంలో జరిగిన అక్రమాలు, అభివృద్ధి పనులపై క్వాలిటీ కంట్రోల్ అధికారులు తనిఖీ చేపడుతున్నారని తెలిపారు. వారి నివేదికల ఆధారంగా కాంట్రాక్టర్లకు బిల్లులు మంజూరు అవుతాయని స్పష్టం చేశారు. ఇప్పటి వరకు మొదలుపెట్టిన పనులు పూర్తి చేయాలని కాంట్రాక్టర్లు, అధికారులను ఆదేశించారు.

Advertisement

Next Story

Most Viewed