- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
100 రోజుల్లో నివేదిక.. థర్మల్ పవర్ ప్లాంట్లలో అక్రమాలపై ప్రభుత్వం ఫోకస్
దిశ, డైనమిక్ బ్యూరో: యాదాద్రి, దామరచర్ల, భద్రాద్రి, మణుగూరు ప్లాంట్లలో అవకతవకలు జరిగాయనే ఆరోపణలపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది. ఈ క్రమంలోనే జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి అధ్యక్షతన కమిషన్ ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ప్లాంట్లలో జరిగిన అక్రమాలపై జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి అధ్యక్షతన ఇవాళ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ట్రాన్స్ కో, జెన్ కో సీఎండీలు ఇతర అధికారులు హాజరయ్యారు.
ఈ సందర్భంగా జస్టిస్ నరసింహారెడ్డి మాట్లాడుతూ.. పవర్ ప్లాంట్లలో అక్రమాలపై 2 గంటలు సమీక్షించామని పేర్కొన్నారు. నిర్ణయాలు తీసుకున్న వారికి లేఖలు రాస్తామని చెప్పారు. పవర్ ప్లాంట్లలో అక్రమాలపై రాజకీయాలకు అతీతంగా విచారణ చేస్తామని స్పష్టం చేశారు. వంద రోజుల్లో పవర్ ప్లాంట్ల అక్రమాలపై నివేదిక ఇస్తామని స్పష్టం చేశారు. పీపీఏ ఒప్పందాలపై విచారణ చేస్తామన్నారు. ఇవాళ ప్రాథమిక పరిశీలన చేశామని, ప్లాంట్లకు సంబంధించిన అన్ని దస్త్రాలు వచ్చాయని తెలిపారు.