- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
గాంధీ ఐడియాలజీ కేంద్రంగా బాపూ ఘాట్ ను అభివృద్ధి చేస్తాం : సీఎం రేవంత్ రెడ్డి
దిశ, వెబ్ డెస్క్ : అంతర్జాతీయ స్థాయిలో గాంధీ ఐడియాలజీ కేంద్రంగా బాపూ ఘాట్ ను అభివృద్ధి చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి(CM REVENTH REDDY) స్పష్టం చేశారు. ఏబీపీ నెట్ వర్క్ ఆధ్వర్యంలో నిర్వహించిన ది సౌథెర్న్ రైజింగ్ సమ్మిట్ 2024( The southern Rising Summit 2024) కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరై మాట్లాడారు. ఈసా, మూసా నదులు కలిసే చోట ఉన్న బాపూ ఘాట్ ను ప్రపంచమంతా హైదరాబాద్ వైపు చూసేలా అభివృద్ధి చేయబోతున్నామన్నారు. గుజరాత్ లో సర్ధార్ పటేల్ విగ్రహంలా... బాపూ ఘాట్ లో గాంధీజీ విగ్రాహాన్ని ఏర్పాటు చేస్తామని తెలిపారు. మూసీ పునరుజ్జీవాన్ని, బాపూ ఘాట్ అభివృద్ధిని బీజేపీ వ్యతిరేకిస్తోందని విమర్శించారు. గాంధీ వారసులుగా మేం బాపూ ఘాట్ ను అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి చేసి తీరుతామన్నారు. దీన్ని బీఆరెస్, బీజేపీ ఎందుకు అడ్డుకోవాలని చూస్తున్నాయని ప్రశ్నించారు. హైదరాబాద్ ను విశ్వనగరంగా అభివృద్ధి చేస్తామని, ఇతర రాష్ట్రాలలోని నగరాలతో కాకుండా న్యూయార్కు వంటి ఇతర దేశాల నగరాలకు ధీటుగా తీర్చిదిద్దుతామన్నారు.
పదేళ్ళుగా అధికారాన్ని అనుభవించిన మాజీ సీఎం కేసీఆర్ ప్రతిపక్ష నేతగా పది నిమిషాలు అసెంబ్లీకి వచ్చి వెళ్ళాడని, ప్రజల సమస్యలపై అసెంబ్లీలో మాట్లాడటం లేదని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బలహీన పరిచేందుకు బీజేపీ, బీఆర్ఎస్ లు కుమ్మక్కు రాజకీయాలు చేస్తున్నాయని, పార్లమెంటు ఎన్నికల్లో అదే రీతిలో పనిచేశారని రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. ప్రధాని మోడీ ప్రభుత్వం దక్షిణ భారత దేశం పట్ల చిన్నచూపు వహిస్తుందని ఆరోపించారు.
- Tags
- CM REVENTH REDDY