- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
విజయవాడ-హైదరాబాద్ హైవే మార్గాని పూర్తి చేస్తాం: కోమటిరెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు
దిశ, డైనమిక్ బ్యూరో: రెండేళ్లలోపు విజయవాడ-హైదరాబాద్ మార్గాన్ని రూ. 4వేల కోట్ల బడ్జెట్‌తో పూర్తి చేయనున్నామని మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి వెల్లడించారు. రెండు తెలుగు రాష్ట్రాలకు ఉపయోగకరమైన 6 లేన్ గురించి కూడా చర్చించామన్నారు. ఏపీ విభజన చట్టం ప్రకారం గ్రీన్‌ఫీల్డ్ హైవేకు రూపకల్పన చేస్తున్నట్లు కేంద్ర మంత్రి వెల్లడించారని చెప్పారు. ఇవాళ ఢిల్లీలో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో రాష్ట్రంలోని వివిధ రహదారుల ప్రాజెక్టులపై కోమటి రెడ్డి చర్చలు జరిపారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. జాతీయ రహదారులకు సంబంధించి గత అయిదేళ్లలో తెలంగాణ అతి తక్కువగా నిధులు వచ్చాయన్నారు.
భూ సమీకరణ, ఇతర అంశాలను అప్పటి రాష్ట్ర ప్రభుత్వం పెడచెవిన పెట్టిందని, దాంతో పనులు ఆగిపోయాయని స్పష్టంచేశారు. 2016లో ప్రకటించిన రీజినల్ రింగ్‌రోడ్డును మరిచిపోతే తమ ప్రభుత్వం వచ్చిన తర్వాత కదలిక తీసుకోచ్చామన్నారు. యూటీలీటీ చార్జీలను సైతం కేంద్ర మంత్రి గడ్కరీ భరిస్తామని భరోసా ఇచ్చారన్నారు. 50-50 షేరింగ్‌లో భూసమీకరణ ప్రారంభించాలని తాజా సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. అన్ని వినతులపై కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించారని, తెలంగాణకు రావాల్సిన నిధులను సాధించడమే తమ లక్ష్యం అని పేర్కొన్నారు.